కేటీఆర్‌కు మరో షాక్.. ఈడీ కేసు నమోదు
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడగా.. తాజాగా, ఈడీ అధికారులు రంగంలోకి దిగడం సంచలనంగా మారింది.

కాగా, ఫార్ములా ఈ కార్ రేస్‌కు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను క్యాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.
మరోవైపు, కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం, ప్రభాకర్ రావు, గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని, ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు కోరారు. ఇరువుపులా వాదనలు విన్న హైకోర్టు.. డిసెంబర్ 30 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.
అయితే, కేటీఆర్‌పై నమోదు చేసిన కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 27కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం కేసులో ఈడీ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఏసీబీతోపాటు ఈడీ దర్యాప్తు ఇప్పుడు కీలకంగా మారింది. మరోవైపు, రూ. 55 కోట్ల వ్యవహారంలో యూకేకు చెందిన ఏస్ నెక్ట్స్ కంపెనీపైనా ఈడీ కేసు నమోదు చేసింది.












Click it and Unblock the Notifications