తెలంగాణలో కొత్త మద్యం పాలసీ..! ఆ ధరలు భారీగా పెంపు..!

తెలంగాణలో కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే కొత్త మద్యం పాలసీని తీసుకురావడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ మేరకు మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ త్వరలో పూర్తి చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మద్యం వ్యాపారానికి సంబంధించిన నిబంధనల్లో కొన్ని కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాలకు దరఖాస్తు ఫీజును ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం రెండేళ్ల గడువుతో లైసెన్సులు ఇస్తున్నారు. అయితే రుసుం పెంచినందుకు అనుగుణంగా మూడేళ్ల గడువు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో కొత్త మద్యం పాలసీని రూపకల్పన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా ఇదివరకే ఉన్న మద్యం పాలసీలో భారీగా మార్పులు చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. నూతన పాలసీలో భాగంగా మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును భారీగా పెంచడమే కాకుండా.. గడువును కూడా పెంచేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు మద్యం దుకాణాలకు దరఖాస్తు ఫీజును ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాక ప్రస్తుతం ఉన్న రెండేళ్ల గడువును మూడేళ్లకు పెంచాలని సర్కార్ భావిస్తోంది. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి.. జులై 29న ఎక్సైజ్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కొత్త మద్యం పాలసీపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తే కేవలం 30 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వానికి 30,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేవలం మద్యం దుకాణాల దరఖాస్తుల విక్రయం ద్వారా రూ.3,500 కోట్ల మేర ఆదాయం వస్తుందని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,620 వరకు వైన్‌ షాపులున్నాయి. ఒక్క హైదరాబాద్‌ లోనే 690 మద్యం దుకాణాలున్నాయి. 2023-25 లైసెన్స్‌ కాలానికి ఆ ఏడాది డిసెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ గడువు ఈ ఏడాది నవంబరు 30 తో ముగియనుంది. అయితే సెప్టెంబరులోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉంటాయనే ప్రచారం నేపథ్యంలో ఈ సారి ఆ ఎన్నికల కంటే ముందే దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తిచేయాలని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది. ఈ మేరకు ఆగస్టులోనే దరఖాస్తుల స్వీకరణను పూర్తిచేసి లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించడానికి ఎక్సైజ్‌శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

Telangana Gears Up for New Liquor Policy Ahead of Local Body Elections

మరోవైపు జులై 28 న జరిగిన కేబినెట్ మీటింగ్ లో మైక్రో బ్రూవరీస్‌ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కోర్ తెలంగాణ అర్బన్ సిటీ ఏరియాతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ లలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం ఇచ్చింది. ఈ నేపథ్యంలో మైక్రో బ్రూవరీస్ చట్టంలో అవసరమైన సవరణలు చేసి త్వరలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నగరంలోని ప్రతి 5 కిమీలకు, పట్టణాల్లో 30 కిమీలకు ఒక మినీ బ్రూవరీలను ఏర్పాటు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+