తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్.. అమల్లోకి కొత్త ఆరోగ్య పథకం.. మార్గదర్శకాలు ఇవే..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం'(NEHS) నేటి నుంచి అధికారికంగా, పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చింది. ఈ పథకం అమలుకు సంబంధించిన సమగ్ర పాలనా, నిర్వహణ మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ (EHCT) అధికారికంగా విడుదల చేసింది. ఈ మేరకు శనివారం డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రస్టీల బోర్డు ఆమోదం మేరకు రూపొందించిన ఈ మార్గదర్శకాలకు సంబంధించి ప్రొసీడింగ్స్ నెం. 01/EHCT/NEHS/1505/2026 ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

ఇక ఈ నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 17.88 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. గతంలో ఉన్న పాత పథకం లోపాలను పూర్తిగా సవరిస్తూ.. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) తరహాలో ఏకంగా 1,816 మెడికల్, సర్జికల్ ప్యాకేజీలను ఈ కొత్త విధానంలో అందుబాటులోకి తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. పాత విధానంలో ఉన్న అనేక లోపాలను గుర్తించిన ప్రభుత్వం, మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఈ నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గతంలో ఉన్న ఆరోగ్య పథకంలో ఎదురైన జాప్యం, ఇతర ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాతనే ఈ కొత్త ఆరోగ్య పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.

Telangana Good news for employees New health scheme comes into effect here are the guidelines

ఈ ఆరోగ్య పథకంలో భాగంగా సుమారు 4.38 లక్షల మంది సర్వీసులో ఉన్న ఉద్యోగులు అలాగే 3.62 లక్షల మంది పెన్షనర్లు ఇక 9.88 లక్షల మంది వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన, కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందనున్నాయి. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వేయికి పైగా ఆసుపత్రులను అంటే 114 ప్రభుత్వ ఆసుపత్రులు, 886 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులను రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసింది. ఇక ఉద్యోగులు తమకు అందించిన డిజిటల్ హెల్త్ కార్డుల ద్వారా నేరుగా ఆయా ఆస్పత్రులకు వెళ్లి ఉచితంగా చికిత్స పొందే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, ఉద్యోగులు, ఆసుపత్రుల యాజమాన్యాలకు ఎదురయ్యే బిల్లుల చెల్లింపుల జాప్యాలు కూడా శాశ్వతంగా తొలిగిపోనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+