ఏపీకి చెప్పాం, బాబు విఫలమయ్యారని వీరొచ్చారా: సుప్రీంకోర్టులో తెలంగాణ
హైదరాబాద్: నీటికి సంబంధించిన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తప్ప వ్యక్తులు కోర్టును ఆశ్రయించేందుకు వీలు లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని, వాటిని పరిగణలోకి తీసుకోవాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కొన్ని ప్రాజెక్టులు అక్రమమని కొందరు ఏపీ రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.
నీటికి సంబంధించిన అంశాలు, అంతర్ రాష్ట్ర జల వివాదాలు, నీటి కేటాయింపులకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వాలు తప్ప వ్యక్తులు కోర్టులను ఆస్రయించడానికి అవకాశం లేదని పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం లేఖరు రాసిందని, వీటికి తాము సమాధానం ఇచ్చామని పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న అభిప్రాయంతో రైతులు కోర్టుకు వచ్చారా అని ప్రశ్నించింది. కావేరీ జలాలకు సంబంధించి కొందరు కోర్టును ఆశ్రయిస్తే అనుమతించలేదని గుర్తు చేసింది. ఆర్డీఎస్ ఎత్తు పైన పాలమూరు జిల్లాకు చెందిన రైతు ఆత్మలింగా రెడ్డి కోర్టుకు వ్చినప్పుడు కూడా అనుమతించలేదని పేర్కొంది.
పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు పాతవేనని, కొత్తగా నిర్మించడం లేదని కూడా చెప్పింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం వీటిని చేపట్టిందని, అప్పుడు నెమ్మదిగా పనులు జరిగినా, ఇప్పుడు తమ ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోందని తెలిపింది. మా నీళ్లు మేం వాడుకోవడానికి ప్రాజెక్టులు నిర్మించుకుంటే అడ్డుకుంటున్నారని పేర్కొంది.
నీటికి సంబంధించిన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తప్ప వ్యక్తులు కోర్టును ఆశ్రయించేందుకు వీలు లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని, వాటిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కొన్ని ప్రాజెక్టులు అక్రమమని కొందరు ఏపీ రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications