నాటుకోళ్ల పెంపకం.. ప్రభుత్వ ప్రోత్సాహం.. యూనిట్లు పెట్టుకోవడానికి సదావకాశం

హైదరాబాద్ : నాటుకోళ్ల పెంపకానికి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించనుంది. ఎలాంటి ఆసరా లేని ఎస్సీ, బీసీ-సీ మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నాటుకోళ్ల పెంపకం యూనిట్లకు శ్రీకారం చుట్టారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న ఈ పథకాన్ని జిల్లా ఎస్సీ కార్పొరేషన్లు పర్యవేక్షించనున్నాయి. ఆ క్రమంలో తొలుత పైలట్ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. గ్రామానికి ఒకరు చొప్పున దాదాపు రెండు వందల పల్లెల్లో నాటుకోళ్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

నాటుకోళ్ల పెంపకానికి ప్రభుత్వ సాయం

నాటుకోళ్ల పెంపకానికి ప్రభుత్వ సాయం

నాటుకోళ్ల పెంపకానికి ప్రభుత్వ సాయం తోడు కానుంది. ఎలాంటి ఆసరా లేని ఎస్సీ, బీసీ - సీ మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఈ పథకం తెరపైకి తీసుకొచ్చారు అధికారులు. నాటుకోళ్ల పెంపకంతో వారు ఉపాధి పొందేలా డిజైన్ చేశారు. త్వరలోనే నాటుకోళ్ల పెంపకం పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు. అర్హులైన వారు ఈ నెల 10వ తేదీ లోగా ఆయా మండలాల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కుల, ఆదాయ పత్రాలతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోటోలు సమర్పించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలు కావాలంటే ఆయా జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో ఉండే ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలి.

ఆసరా లేని ఎస్సీ, బీసీ-సీ మహిళలకు ప్రత్యేకం

ఆసరా లేని ఎస్సీ, బీసీ-సీ మహిళలకు ప్రత్యేకం

రాష్ట్రమంతటా ప్రారంభించనున్న నాటుకోళ్ల పెంపకం ఆసరా లేని ఎస్సీ, బీసీ-సీ మహిళలకు ఉపాధి అవకాశంగా మారనుంది. ఆ మేరకు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం అమలు కానుంది. 21 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు గలవారు ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశముంది. తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద 200 గ్రామాల్లో ఊరికి ఒకరి చొప్పున నాటుకోళ్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు.

లబ్ధి దారుల ఎంపికలో కొన్ని నిబంధనలు

లబ్ధి దారుల ఎంపికలో కొన్ని నిబంధనలు

లబ్దిదారుల ఎంపిక కోసం కొన్ని నిబంధనలు రూపొందించారు. దరఖాస్తు చేసుకునే వారికి వారు నివాసముండే ఇంటి పక్కన మినిమం 3 గుంటలు మాగ్జిమమ్ 10 గుంటల భూమి ఉండాలి. అయితే ఒక్కో యూనిట్ కాస్ట్‌ ధర 50 వేల రూపాయలుగా నిర్ణయించారు. ఒక్కో యూనిట్‌కు దాదాపు 120 కోళ్లను మంజూరు చేస్తారు. అంతేకాదు లబ్ధి దారులు ఉపాధి హామీ పథకం కింద 37 వేల రూపాయలతో పౌల్ట్రీ షెడ్‌ను నిర్మించుకోవడానికి సాయం అందనుంది.

కమిటీ నిర్ణయం మేరకే లబ్ధి దారుల ఎంపిక

కమిటీ నిర్ణయం మేరకే లబ్ధి దారుల ఎంపిక

అయితే లబ్ధి దారుల ఎంపిక విషయంలో గ్రామ సభ ఆమోదం తప్పనిసరి. అయితే ఎస్సీ కార్పొరేషన్, వెటర్నరీ, ఉపాధి హామీ శాఖ అధికారుల సమన్వయంతో నాటుకోళ్ల పెంపకానికి చర్యలు తీసుకోనున్నారు. ఆ మేరకు మార్గదర్శకాలను సిద్ధం చేయనున్నారు. అంతేకాదు లబ్ధి దారుల ఎంపిక విషయంలో ఎంపీడీవో నేతృత్వంలోని కమిటీ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. 50 వేల రూపాయల పూర్తి సబ్సిడీతో అందించనున్న నాటుకోళ్ల పెంపకం పథకం ఆసరా లేని ఎస్సీ, బీసీ-సీ మహిళలకు వరంగా మారనుంది. నాటుకోళ్లకు రానురాను డిమాండ్ పెరగనుండటంతో హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో మంచి ధర పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో నాటుకోళ్ల పెంపకంతో ఎంతో కొంత ఉపాధి కలగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+