కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు

తెలంగాణలో కోటి 15 లక్షల కుటుంబాలకు జీవిత బీమా, ఆరోగ్య భద్రత అందించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తోన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం రంగాలను ఛాలెంజ్ గా తీసుకున్నామని, పేదలకు సరైన విద్య, వైద్యాన్ని అందించగలిగితే దాదాపు 90 శాతం సమస్యలను పరిష్కరించినట్టవుతుందని అన్నారు. అందుకే జీవిత బీమా, ఆరోగ్య భద్రత అందించాలనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

హదరాబాద్ కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కొత్తగా నిర్మించిన కార్పొరేట్ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. మహిళలు అత్యధికంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నందున రాష్ట్రంలోని 65 లక్షల మంది స్వయం సహాయక మహిళా సంఘాలకు డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించామని గుర్తు చేశారు. రెండేళ్లలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ కింద 1800 కోట్ల రూపాయలు పేదల వైద్యం కోసం ఖర్చు పెట్టామని పేర్కొన్నారు.

Telangana Government Eyes Life Insurance Coverage for 1 3 Crore Families CM Revanth Reddy Says

అలాగే ఉస్మానియా ఆసుపత్రితో పాటు వరంగల్, అల్వాల్, ఎల్బీనగర్, సనత్ నగర్ లల్లో టిమ్స్ నిర్మాణాలకు దాదాపు రూ. 10,000 కోట్లు ఖర్చు చేస్తోన్నామని తెలిపారు. దీనివల్ల అదనంగా 10,000 పడకల ఆసుపత్రులను అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. యాంత్రికంగా సాగుతున్న విద్యా విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టామని, నైపుణ్యత మెరుగుపర్చుకోకుంటే ప్రపంచంతో పోటీ పడలేమని వ్యాఖ్యానించారు రేవంత్. అందుకే విద్యా విధానంలో సంస్కరణలు చేపట్టామని అన్నారు.

నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్యను అందించడానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విధానం తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 12 వ తరగతి పాఠశాల విద్య కింద తెస్తామని తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా లేదా 50 శాతం ఖర్చుతో రవాణా సౌకర్యం కల్పిస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్ అర్బన్ రీజియన్‌లో నూతన విధానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని అన్నారు.

బ్లూ కాలర్ జాబ్స్‌ను ఏఐ రిప్లేస్ చేయలేదని, స్కిల్స్ లేని కారణంగా ప్రతి ఏటా రాష్ట్రం నుంచి 1.10 లక్షల ఇంజినీరింగ్ గ్యాడ్యుయేట్లు ప్రపంచంతో పోటీ పడలేని పరిస్థితి నెలకొందని రేవంత్ పేర్కొన్నారు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించినట్లు చెప్పారు. టాటా కన్సల్టెన్సీ సహకారంతో పాత ఐటీఐలను ఏటీసీ సెంటర్లుగా మార్చామని, తర్వాతి దశలో పాలిటెక్నిక్ కాలేజీలను కూడా ఈ విధానంలోకి తెస్తామని అన్నారు.

కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న డాక్టర్లు సామాజిక బాధ్యత కింద సంవత్సరంలో నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు సేవలు అందించాలని రేవంత్ సూచించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఒక వేదిక సృష్టించబోతోందని, విదేశాల్లో ఉన్న తెలంగాణ డాక్టర్లతో పాటు ఇక్కడ కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రేవంత్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+