హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్: రూ. 3800 కోట్ల భారీ జరిమానా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరి ట్రిబ్యునల్ (ఎన్జీటీ) భారీ షాకిచ్చింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలు, తీర్పులు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక, రూ. 3800 కోట్ల భారీ జరిమానా వేసింది. రెండు నెలల్లో ఈ మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

వ్యర్ధాల నిర్వహణకు సత్వర చర్యలు చేపట్టి పురోగతి తెలిపాలని సూచించింది.
మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య, వ్యర్థాల నిర్వహణ సరిగా చేయడం లేదని పర్యావరణ సురక్షా స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను 2014లో ఎన్జీటీకి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana government fined Rs 3800 crore by NGT.

351 నదీ పరీవాహక ప్రాంతాలు, 124 నగరాల్లో గాలి కాలుష్యంపైనా పిటిషన్ లో పేర్కొంది. 100 కాలుష్య కారక పారిశ్రామిక ప్రాంతాలు, అక్రమ ఇసుక మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ కోరింది. ఈ రెండు అంశాలను ఎన్జీటీ ప్రస్తుతం ఎన్జీటీ విచారణకు స్వీకరించింది.

ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై విచారణ చేపట్టిన ఎన్జీటీ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి వివరణ కోరింది. అయితే, తెలంగాణ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని హరిత ట్రైబ్యునల్ 3800 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

English summary
Telangana government fined Rs 3800 crore by NGT.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X