తెలంగాణ ముందస్తు చర్యలు- భారీగా నిధులు విడుదల
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతి జిల్లాకు కోటి రూపాయలు చొప్పున మొత్తం రూ.33 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వుల జారీ చేశారు.
వర్షాకాలంలో అవసరమైన సామగ్రిని సేకరించేందుకు ఈ నిధులను వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. విపత్తు నిర్వహణకు సంబంధించిన నిబంధనల ప్రకారం ఈ నిధులను సద్వినియోగం చేయాలని స్పష్టం చేసింది. దీని ద్వారా భారీ వర్షాలు, వరదల సమయంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టడానికి వీలవుతుంది.

సమయానికి అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచడం వల్ల ప్రాణ నష్టం వాటిల్లకుండా నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లా అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బందితో పాటు ఆప్దా మిత్ర వాలంటీర్ల సేవలను కూడా ఈ ప్రక్రియలో వినియోగించాలని సూచించింది.
పోలీస్ శాఖ నుంచి కూడా సహాయక చర్యలకు అవసరమైన వస్తువుల జాబితాను తీసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. భవనాలకు మరమ్మతులు చేయడానికి ఈ నిధులను ఉపయోగించరాదని, ఆ పనుల కోసం సంబంధిత శాఖల నిధులను మాత్రమే వినియోగించాలని ఆయన స్పష్టం చేశారు.
వర్షాకాలం ముగిసిన తర్వాత సేకరించిన సామగ్రిని అగ్నిమాపక శాఖ అధికారుల సంరక్షణలో భద్రంగా ఉంచాలని, అవసరమైనప్పుడు వాటిని తిరిగి ఉపయోగించాలని ప్రభుత్వం పేర్కొంది. భారీ వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు పంపిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
బోట్లు, లైఫ్ జాకెట్లు, సైరన్లు, మైక్ సెట్లు, తాళ్లు, గ్యాస్ కట్టర్లు, బుష్ కట్టర్లు, నిచ్చెనలు వంటి వాటిని కొనుగోలు చేయాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు వరదలు, భారీ వర్షాలు సంభవించే ముందుగానే సహాయక చర్యల కోసం నిధులను విడుదల చేస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది.
దీని ద్వారా నష్టాలను తగ్గించవచ్చని, ప్రాణాలను కాపాడవచ్చని అభిప్రాయపడింది. ఈ పరికరాలను వరద ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను తరలించడానికి, ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి ఉపయోగిస్తారు. అత్యవసర సమయాల్లో సహాయక సామగ్రి సకాలంలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో కేరళ నమూనాను అనుసరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications