ప్రజాపాలన దినోత్సవం: సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రాంతానికి నిజాం పాలనను నుంచి విముక్తి కలిగిన సెప్టెంబర్ 17పై రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణలోని 33 జిల్లాల్లో జెండా ఆవిష్కరణ చేసే ప్రజా ప్రతినిధుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. కాగా, గత ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా హైదరాబాద్ పపరేడ్ గ్రౌండ్‌లో అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా, రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది.

Telangana Government has decided to celebrate 17th September as Telangana praja palana dinotsavam

తెలంగాణలోని కోచింగ్ సెంటర్లపై కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సమావేశమైంది. మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క ఆధ్వర్యంలో విద్య వ్యవస్థలో తేవాల్సిన సంస్కరణలపై ఉపసంఘం చర్చించింది. కోచింగ్ సెంటర్ల నిర్వహణలో పాటించాల్సిన మార్గదర్శకాలపై కూడా చర్చ జరిగింది.

కేంద్ర మార్గదర్శకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు కావట్లేదని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్లలో కేంద్ర మార్గదర్శకాలను అమలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+