Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జీతం పెంపు: కార్మికులకు సీఎం కేసీఆర్ మేడే కానుక, తక్షణమే అమల్లోకి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికులకు తీపి కబురు అందించారు. 'మే డే' కానుకగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను నెలకు తలా 1,000 (వెయ్యి) రూపాయల చొప్పున పెంచాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) నిర్ణయించారు.

జిహెచ్ఎంసి, మెట్రో వాటర్ వర్క్స్ తో పాటు, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలల్లో పనిచేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ నెల నెలా పెరిగిన వేయి రూపాయల వేతనం అదనంగా జీతంతో పాటు కలిపి అందుతుందని సీఎం తెలిపారు.

Telangana government hikes wages of sanitation workers in the state on may day

అంతేగాక, పెరిగిన వేతనాలు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. 'సఫాయన్న నీకు సలాం అన్న' అనే నినాదంతో పారిశుద్ధ్య కార్మికుల కృషిని, త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదని సీఎం అన్నారు. రాష్ట్రంలో కష్టించి పనిచేసే ప్రతీ ఒక్క కార్మికుని సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు సీఎం కేసీఆర్.

త్వరలోనే రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల జీతాలు కూడా పెంచాలని నిర్ణయించామని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ పల్లెలు, పట్టణాలు గుణాత్మక అభివృద్ధిని సాధించడంలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ గొప్పదన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన పల్లెలు, పట్టణాలకు అవార్డులు రావడం వెనుక వీరి కృషి దాగి ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.

పల్లెలు, పట్టణాల్లో నాటి, నేటి పరిస్థితులకు ఎంతో స్పష్టమైన తేడా ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు. కార్మికుల కష్టసుఖాలను తెలుసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ వారి జీతాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వారికి అండగా నిలబడిందని అన్నారు. తద్వారా పారిశుద్ధ్య కార్మికులు కూడా అదే కృతజ్ఞత భావంతో మనస్ఫూర్తిగా పని చేస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడం పట్ల ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

అంతకుముందు.. కార్మికుల దినోత్సవం 'మే డే' సందర్భంగా కార్మిక, కర్షక, కూలీలు, వృత్తి పనిచేసేవారు, మొత్తంగా తమ చెమట చుక్కలను రాల్చి జీవనం సాగిస్తూ, పరోక్షంగా సమాజాభివృద్ధిలో భాగస్వాములౌతున్న ప్రతి ఒక కష్టజీవికి ముఖ్యమంత్రి కేసీఆర్ మేడే శుభాకాంక్షలు తెలిపారు.
తర తరాలుగా కష్టజీవి శ్రమతోనే ఈ ప్రపంచంలో సంపద సృష్టి జరుగుతున్నదని, మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లని సీఎం తెలిపారు. కార్మిక కర్షక సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని సీఎం వివరించారు.

కార్మికులకు ప్రమాదం కారణంగా మరణం సంభవిస్తే రూ. 6 లక్షలను సంబంధిత కుటుంబానికి చెల్లించడం జరుగుతున్నదన్నారు. 2014 నుంచి 2023 వరకు ఇలా మరణించిన కార్మికులకు సంబంధించిన 4,001 బాధిత కుటుంబాలకు రూ. 223 కోట్లను చెల్లించడం జరిగిందని సీఎం తెలిపారు. ప్రమాదం కారణంగా వైకల్యానికి గురైతే రూ. 5 లక్షల చొప్పున, వైకల్యానికి గురైన 504 మంది కార్మికులకు రూ. 8.9 కోట్లను నేటివరకు చెల్లించడం జరిగిందని సీఎం తెలిపారు. వారి కుటుంబాల కోసం కూడా ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+