కొత్త రేషన్ కార్డుల జారీపై రేవంత్ ప్రభుత్వం తాజా నిర్ణయం..!!
తెలంగాణలో పాలనా పరంగా రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వీటి పైన అధికారులు స్క్రూటినీ ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ తాజాగా కొత్త రేషన్ కార్డుల పైన తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.
సుదీర్ఘ కసరత్తు
తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పైన ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేస్తుంది. ప్రస్తుతమున్న రేషన్ కార్డుల రూపం మార్చాలని నిర్ణయించింది. వీటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని డిసైడ్ అయింది. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి కసరత్తు వేగవంతం చేయనున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు పరిమితి గతంలో ఉన్న ఐదు లక్షలను రేవంత్ ప్రభుత్వం రూ పది లక్షలకు పెంచింది. దీంతో పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డ్ ఓ చిన్న పుస్తకం తరహాలో పంపిణీ చేశారు. ఇప్పుడు వీటి రూపం మార్చాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

కొత్త కార్డుల జారీ
గతంలో ఉన్న ఆహారభద్రత కార్డుల స్థానంలో రైతుబంధు పాస బుక్ సైజులో రేషన్ కార్డులు జారీ అయ్యాయి. ముందువైపు కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు, వెనకవైపు చిరునామా, ఇతర వివరాలు ఉండేవి. ఆ తర్వాత రేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు వచ్చాయి. ఒక పేజీతో ఒక వైపే ఉండే ఈ కార్డులో యజమాని, కుటుంబ సభ్యుల ఫోటోలు లేకుండానే కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్ దుకాణం కార్డు సంఖ్య మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మంజూరు చేయనున్న కొత్త కార్డులో ఎలాంటి వివరాలు పొందుపరచాలి అనే అంశం పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తం కుటుంబానికి సంబంధించిన సమాచారం ఒకే కార్డులో అందుబాటులో ఉండేలాగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.
కోడ్ ముగిసిన వెంటనే
తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే రైతు రుణమాఫీ తో పాటుగా కొత్త రేషన్ కార్డుల మంజూరు పైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం ఈసీ నుంచి తాజాగా వచ్చిన మార్గదర్శకాల మేరకు ఆ నిర్ణయాలను వాయిదా వేసింది. ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తుల్లో ఎక్కువ సంఖ్యలో కొత్త రేషన్ కార్డుల కోసమే అభ్యర్థులు వచ్చాయి. దీంతో కోడ్ పూర్తయిన తర్వాత ఉన్నతాధికాలతో ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల మంజూరు చేస్తేనే లబ్ధిదారునికి సంబంధించిన ఆహార భద్రత, ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ పథకాల లబ్ధి, కుటుంబ సభ్యుల వివరాలతో కలిపి పూర్తి సమాచారం కార్డులో ఉండేలా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత ఈ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం కల్పిస్తుంది. ఆ తర్వాత కార్డుల చారి ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications