వారికి కేటాయించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వెనక్కి, ప్రభుత్వం అనూహ్య నిర్ణయం..!!
ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో కొత్త విధానం అమలు చేస్తోంది. లబ్దిదారులకు పారదర్శకంగా కేటాయింపులు చేస్తూనే.. మార్గదర్శకాలకు భిన్నంగా వ్యవహరించిన వారి విషయంలో కఠినంగా నిర్ణయాలు తీసు కొంటోంది. అందులో భాగంగా దాదాపు 19 వేల మందికి నోటీసులు జారీ చేసింది. వారికి ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెనక్కు తీసుకోవాలని డిసైడ్ అయింది.
ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్స్ విషయంలో ఆసక్తి కర నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పొందిన లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ తాజాగా హెచ్చరిక చేసింది. ప్రభుత్వం నుంచి తీసుకున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసించని లబ్దిదారులను నుంచి వాటిని తిరిగి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఖాళీగా ఉంచిన ఇళ్ల వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఆ లబ్ధిదారులకు ఇప్పటికే ప్రభుత్వం రెండు సార్లు నోటీసులు పంపింది. ఇక మూడో సారి కూడా నోటీసులకు స్పందించకపోతే వారి పేర్లను జాబితా నుంచి తొలగించి ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే డిసైడ్ అయింది. అందులో భాగంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో గత రెండు నెలల క్రితం అధికారులు తనిఖీలు నిర్వహించారు.

తుది నోటీసులు... స్వాధీనం దిశగా కసరత్తు
కాగా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన సుమారు 19 వేల మంది మంది లబ్ధిదారులు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసించడం లేదని అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే లబ్ధిదారులందరూ తమకు కేటాయించిన ఇళ్లలో చేరాలని అధికారులు వారికి నోటీసులు పంపారు. కానీ లబ్ధిదారులు మాత్రం వాటిని సీరియస్ గా తీసుకోలేదు. దీంతో.. తాజాగా మరోసారి అధికారులు నోటీసులు జారీ చేసారు. వీటికి స్పందన లేకుంటే.. కఠినంగానే నిర్ణయం తీసుకునే విధంగా ఆలోచన చేస్తున్నారు. పేదలకు నగర శివారులో నిర్మించిన 90 వేల ఇళ్లను 2023 ఆగస్ట్‌లో ప్రభుత్వం కేటాయించింది. అయితే అక్కడ సరైన సౌకర్యాలు లేవంటూ దాదాపు 40 మంది లబ్ధిదారులు వాటిలో చేరలేదు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ధరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఖాళీగా ఉన్న డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను వారికి కేటాయించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications