టీఎస్పీఎస్సీ నూతన ఛైర్మన్ గా మాజీ డీజీపీ - సీఎం రేవంత్ నిర్ణయం..!!

తెలంగాణలో మరో కీలక నియామకం పైన సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ పేరును ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆమోదం కోసం గవర్నర్ కు సిఫార్సు చేసింది. ఈ పదవి కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఛైర్మన్ పదవికి 50కి పైగా అప్లికేషన్లు వచ్చాయి. కాగా, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఛైర్మన్ గా ఎంపిక చేసారు. గవర్నర్ ఆమోదం తరువాత అధికారికంగా నియామక ఉత్తర్వులు జారీ కానున్నాయి.

టీఎస్పీఎస్సీకి కొత్త ఛైర్మన్: బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్షల నిర్వహణలో పలు విమర్శలు ఎదుర్కొంది. పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం పైన నాటి ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. గత ప్రభుత్వంలో నియమించిన టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులు రాజీనామా చేసారు.

Telangana Government recommends Ex DGP Mahender Reddy as TSPSC new Chairman as Reports

వాటికి ఆమోదం లభించటంతో టీఎస్పీఎస్సీకి కొత్ ఛైర్మన్, సభ్యల నియామకం పైన ప్రభుత్వం కసరత్తు చేసింది. దీంతో, చైర్మన్‌ పదవికి 50కి పైగా దరఖాస్తులు.. సభ్యుల పదవులకు 320 వచ్చాయి. విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే రేవంత్ టీఎస్పీఎస్సీ నియామకాల పైన సమీక్ష చేసారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన కమిటీ ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది.

మాజీ డీజీపీకి ఛాన్స్: దీంతో, కొత్త ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి పేరు ప్రతిపాదించారు. డీజీపీగా పనిచేసి రిటైరైన వారిలో 62 ఏళ్లలోపు ఉన్న మాజీ అధికారి మహేందర్‌ రెడ్డి మాత్రమే ఉన్నారు. చైర్మన్‌ పోస్టుకు ఆయన పేరునే ప్రభుత్వం ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.

ఐపీఎస్‌ అధికారిగా పనిచేసిన ఆయన ఎంపిక ద్వారా నిరుద్యోగుల్లో నమ్మకాన్ని ఏర్పరచడంతో పాటు నియామక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. సభ్యుల పదవుల కోసం కోసం వివిధ రంగాలకు చెందిన వారి నుంచి సుమారు 371 దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. ఇందులో 50కి పైగా చైర్మన్‌ పోస్టు కోసం వచ్చినట్టు సమాచారం. టీఎస్పీఎస్సీ చైర్మ న్‌ పోస్టుతోపాటు 11 సభ్యుల పోస్టులు ఉన్నాయి ప్రస్తుతం ఇద్దరు సభ్యులు కొనసాగుతున్నారు.

Telangana Government recommends Ex DGP Mahender Reddy as TSPSC new Chairman as Reports

ప్రభుత్వం కసరత్తు: ఇందులో ఒక సభ్యురాలు రాజీనామా చేసినా ఇంకా గవర్నర్‌ ఆమోదించలేదు. మరో సభ్యురాలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. దాంతో మొత్తం 11 పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. సాంకేతికంగా ప్రస్తుతం 9 సభ్యుల పోస్టు లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం చైర్మన్‌ పోస్టుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వం గవర్నర్‌కు పం పించినట్టు తెలిసింది. టీఎస్పీఎస్సీని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మాదిరిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.

టీఎస్పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి యూపీఎస్సీ చైర్మన్‌ను కలిసి చర్చించారు. అధికారులు కేరళవంటి రాష్ట్రాలకు వెళ్లి అక్కడి వ్యవస్థను పరిశీలించారు. ఇక, ఇప్పుడు గవర్నర్ ప్రభుత్వం పంపిన పేర్లను ఆమోదించిన తరువాత మహీందర్ రెడ్డిని అధికారికంగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా నియమించే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+