తెలంగాణ ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు రంజాన్ ప్రార్థనల వెసులుబాటు
రంజాన్ పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: రంజాన్ పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు/కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్/బోర్డులు/ప్రభుత్వ రంగ ఉద్యోగులందరూ రంజాన్ మాసంలో ప్రార్థనలు చేసేందుకు ఒక గంట ముందుగా కార్యాలయాలు/పాఠశాలల నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులు మార్చి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు అమల్లో ఉంటాయి.

టీఎస్-ఎంఎస్ సెంట్రల్ అసోసియేషన్ హైదరాబాద్ చేసిన విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పవిత్ర రంజాన్ నెలలో గంట సమయం ముందుగా విధుల నుంచి బయలుదేరడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయన్ని ముస్లిం ఉద్యోగులు స్వాగతించారు.
కాగా, ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకొనే రంజాన్(Ramzan)కు ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) ఇటీవల స్పష్టం చేశారు. గత గురువారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ, వివిధ శాఖల అధికారులతో కలిసి రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసి ఉల్లాఖాన్, హజ్ కమిటీ చైర్మన్ సలీం, వక్ఫ్ బోర్డ్ సీఈవో ఖాజా మైనోద్దిన్‌తో పాటు జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, శానిటేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications