రూ.303 కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ విద్యార్ధులకు తీపికబురు !!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థులకు తీపికబురు ప్రకటించింది. 2022 సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఇకపై స్కాలర్‌షిప్ పంపిణీ ప్రక్రియలో పారదర్శకత, సమయపాలన, సమన్వయంకు ప్రాధాన్యం ఇవ్వాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

రూ.303 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్..

కాగా ప్రజాభవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులతో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2022 సంవత్సరం నుండి పెండింగ్‌లో ఉన్న రూ. 303 కోట్ల ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని సూచించారు. ఈ నిధుల ద్వారా మొత్తం 2,288 మంది విద్యార్థులకు బకాయిలు చెల్లించనున్నారు. ఒక్కో విద్యార్థికి సగటున రూ. 20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందునుందని తెలుస్తోంది.

telangana-government-release-pending-overseas-scholarship-amount-rs-303-crore

అయితే గత ప్రభుత్వ కాలం నుంచి ఈ స్కాలర్‌షిప్ బకాయిలు అందకపోవడంతో విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రత్యేకంగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో కొత్త ఆంక్షలు, అధిక ఖర్చులు కారణంగా విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరిగిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ నిధుల విడుదలతో విద్యార్థులు తమ చదువును నిరంతరంగా కొనసాగించేందుకు అవకాశం లభిస్తుందని.. సదరు కుటుంబాలపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందని ఆయన తెలిపారు.

డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఒకేసారి అన్ని పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయాలని నిర్ణయించింది. మొదటి విడతలోనే 2022-2024 మధ్య కాలానికి సంబంధించిన అన్ని చెల్లింపులు పూర్తిచేయనుంది. ఈ చర్యతో విద్యార్థులకు నిధులు ఆలస్యమవకుండా విదేశీ యూనివర్సిటీ ఫీజులు, వసతి ఖర్చులు తక్షణమే చెల్లించే అవకాశం ఉంటుంది. అలానే భవిష్యత్తులో ఇలాంటి పెండింగ్‌లు ఏర్పడకుండా.. ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తు, ఆమోద ప్రక్రియను డిజిటల్‌గా సమగ్రం చేయడం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీంతో ప్రతి విద్యార్థి దరఖాస్తు రియల్ టైమ్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా మానిటర్ చేయబడుతుంది.

ఈ నిర్ణయం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సహాయం అందుకోబోతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో మానసిక ఒత్తిడి తగ్గి, భవిష్యత్తు మరింత స్థిరంగా కొనసాగుతుందని అన్నారు. మరోవైపు రాబోయే సంవత్సరాల్లో స్కాలర్‌షిప్ బడ్జెట్‌ను పెంచి, విద్యార్ధుల కోసం కొత్త మార్గదర్శకాలు జారీ చేయాలని యోచిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+