ప్రభాస్ నెత్తిన పాలు పోసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ నటించిన తాజా సంచలనం సలార్. ఈ చిత్రం డిసెంబరు 22వ తేదీన విడుదల కాబోతోంది. ఈ భారీ చిత్రరాజాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మించింది. పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతిబాబు, బాబీసింహా తదితరులు నటించారు. మొదటి నుంచి ప్రశాంత్ నీల్ చిత్రాలకు చేస్తున్న టెక్నీషియన్సే ఈ సినిమాకు కూడా పనిచేశారు.
ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టార్గెట్ రూ.800 కోట్లు అని తెలుస్తోంది. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిపై విపరీతమైన క్రేజ్ ఉంది. సలార్ కు తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊహించనిరీతిలో బంపర్ గిఫ్ట్ ప్రకటించింది. అనుమతిచ్చిన కొన్ని థియేటర్లలో అర్థరాత్రి ఒంటిగంట నుంచే షోలు పడనున్నాయి. అంతేకాదు.. అదనపు షోలు, మిడ్ నైట్ షోలకు కూడా అనుమతిచ్చింది. టికెట్ల పెంపు వారం రోజులపాటు ఉండనుంది.

టికెట్ పై రూ.65 నుంచి రూ.100 వరకు పెంచుకోవచ్చు. అంతవరకే అనుమతి. నైజాంలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రభుత్వానికి వినతిపత్రం పెట్టుకోవడంతో అనుమతులు వచ్చాయి. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ లకు పెంపు వర్తిస్తుంది.
ఈనెల 22వ తేదీ నుంచి రూ.28వ తేదీ వరకు పెంపునకు అనుమతి ఉంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా 20 థియేటర్లకే మిడ్ నైట్ షోలు వేయడానికి అనుమతిచ్చింది. మిగతా థియేటర్లన్నీ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి షో వేసుకోవచ్చు. కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి సర్కార్ అదిరిపోయే గిఫ్ట్ ను డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చిందని, సినిమా కొంచెం బాగున్నా బాక్సాఫీస్ బద్దలవడం ఖాయమంటున్నారు.












Click it and Unblock the Notifications