హైదరాబాద్ మెట్రో రైలుపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
హైదరాబాద్ మెట్రో రైలులో నిత్యం వేల మంది ప్రయాణం చేస్తుంటారు. మెట్రో రైలులో ప్రయాణం వేగంగా ఉండటం వల్ల ఉద్యోగులు, విద్యార్థులు మెట్రో రైలునే ఆశ్రయిస్తుంటారు. అయితే మెట్రో రైలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (PPP) పద్ధతిలో నడుస్తున్న ఈ ప్రాజెక్టులో L&T మెట్రోకు ఉన్న 100శాతం ఈక్విటీని ప్రభుత్వం తన వశం చేసుకుంది. దాంతో మే 1 నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి హైదరాబాద్ మెట్రో రైలు రానుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణకు ప్రభుత్వం ఓ కమిటీని కూడా వేసింది.
హైదరాబాద్ మహానగర వాసులకు నిత్యం సేవలు అందిస్తోంది హైదరాబాద్ మెట్రో రైల్. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలుపై చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రానుంది. ఈమేరకు హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక హైదరాబాద్ మెట్రో భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు, విస్తరణ, నిర్వహణ బాధ్యతలను ఈ కొత్త బోర్డు పర్యవేక్షించనుంది.

తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు తీసుకోనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు డైరెక్టర్స్ గా జయేశ్ రంజన్, వికాస్ రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా, శివధర్ రెడ్డి, అశోక్ రెడ్డి, జితేశ్ వి. పాటిల్ ఉన్నారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైలు జాయింట్ ఎండీగా శివేంద్ర ప్రతాప్ నియామకం అయ్యారు.












Click it and Unblock the Notifications