మహిళలకు శుభవార్త... నెలకు రూ.2500

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించగానే మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని అమలు చేశారు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు.
ఈ నిర్ణయాలవల్ల రేవంత్ రెడ్డిపై ప్రజల్లో సానుకూలత ఏర్పడింది.

డేటా ఆధారంగా..
అభయహస్తం ప్రజాపాలన పేరుతో ఊరూరా కార్యక్రమం నిర్వహించి పేదలకు సంబంధించిన డేటాను తీసుకున్నారు. దీని ఆధారంగా తామిచ్చిన 6 గ్యారెంటీల అమలుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తాజాగా మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుతోపాటు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. మార్చి ఒకటోతేదీ నుంచి ప్రజలకు ఇవి అందుబాటులోకి వచ్చాయి.

telangana government will implement mahalakshmi scheme from july

జులై నుంచి ప్రారంభం
మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 5 లక్షల రూపాయలు ఇస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. తాజాగా మహాలక్ష్మి పథకం అమలుపై దృష్టిసారించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రస్తుతానికి దీన్ని వాయిదా వేయడం అనివార్యమైంది. ఎన్నికలు పూర్తికాగానే కొత్త పెన్షన్లు ఇవ్వడంతోపాటు ప్రస్తుతం ఉన్న పింఛన్లను రూ.4వేలకు పెంచుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500 ఇస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళలకు రూ.2500 అందుతాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎటువంటి పింఛన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నెలకు రూ.2500 అందేలా చర్యలు చేపడుతున్నారు. జులై నుంచి దీన్ని ప్రారంభించబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+