Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Telangana: వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Telangana: గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఎవరికీ కేటాయించని డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎల్-2(సొంత స్థలం లేనివారు) జాబితాలోని వారికి కేటాయించాలని రేవంత్ సర్కారు కసరత్తు ప్రారంభించింది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాను ప్రభుత్వం ఎల్-1(సొంత స్థలం ఉన్న వారు), ఎల్-2(సొంత స్థలం లేనివారు), ఎల్-3(ఇళ్లు ఉన్నా దరఖాస్తు చేసుకున్నవారు)గా విభజించిన సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్ల యాప్ సర్వే ద్వారా ఎల్-1 జాబితాలో సొంత స్థలం ఉన్న 21.93 లక్షల మందిని రేవంత్ సర్కారు చేర్చింది. వారికి ఇల్లు కట్టుకునేందుకు విడతల వారీ రూ.5లక్షలను అందించనుంది. ఎల్-2 జాబితాలో సొంత స్థలాలు లేని 19.96 లక్షల మందికి.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థలాన్ని కేటాయించడంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలను ఇవ్వనుంది. ఎల్-2 జాబితాలో ఉన్న 80 వేల మందికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చాలా మందికి డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎశ్ సర్కారు పదేళ్లలో 2.36 లక్షల డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేసి.. 1.58 లక్షల ఇళ్లను పూర్తి చేసింది. పూర్తి చేసిన వాటిలోనూ 1.36 లక్షల ఇళ్లను పంపిణీ చేయగా..

Telangana Government s Key Decision Double Bedroom Houses for L-2 Beneficiaries

మిగతావి అలాగే ఉన్నట్లు తెలిసింది. మరికొన్ని నిర్మాణ దశల్లో ఉండగా.. వాటి నిర్మాణాలను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లతో హౌసింగ్ బోర్టు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమచారం. చాలా మంది కాంట్రాక్టర్లు బిల్లులు రాకపోవడంతో పనులను మధ్యలోనే ఆపేశారు. ఆ కాంట్రాక్టర్లు మళ్లీ ముందుకొస్తే ఇసుకతో పాటు ఇతర రాయితీలు ఇచ్చి నిర్మాణాలు పూర్తి చేయించాలని హౌసింగ్ బోర్డు భావిస్తోంది. అందులో భాగంగా మధ్యలోనే నిర్మాణం ఆగిపోయిన ఇళ్ల సమాచారాన్ని సేకరించింది. ఆ నిర్మాణాల విషయం కూడా త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+