LRS: వారికి తెలంగాణ సర్కారు శుభవార్త

తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లలో లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోని ప్రజలకు శుభవార్త చెప్పింది. అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు తీసుకొచ్చిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS)ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎల్ఆర్ఎస్‌పై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత నాలుగేళ్లుగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి కూడా క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. 10 శాతం ప్లాట్లు రిజస్టరైన లేఅవుట్లలో మిగిలిన ప్లాట్ల క్రమబద్ధీకరణకూ అవకాశం ఇవ్వనున్నారు.

Telangana government s key decision on LRS

మార్చి 31 వరకు క్రమబద్ధీకరణ ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. నిసేధిత జాబితాలోని భూముల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దే చెల్లింపులు చేసి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

ఎల్ఆర్ఎస్‌కు సంబంధించి ప్రభుత్వానికి 25.67 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. ఇందులో ప్లాట్లకు సంబంధించినవి 25.53 లక్షల దరఖాస్తులు ండగా, లేఅవుట్ల దరకాస్తులు 0.13 లక్ష్లు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+