ఆర్టీసి ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఇక నుంచి..!!

తెలంగాణ ఆర్టీసి ఉద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడం) బిల్లు-2023కి ఈరోజు గౌరవనీయమైన గవర్నర్ తెలిపారు.దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్ర‌భుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల‌కు, కార్మికుల‌కు గ‌వ‌ర్న‌ర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన బిల్లుకు నెల రోజుల త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ ఆమోదం లభించింది.

కొంత కాలంగా ఎదరుచూస్తున్న టీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అధికారికంగా పూర్తయింది. తెలంగాణ ప్రభుత్వం గతంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ ఆర్టీసీలో పని చేస్తున్న 43,373 మంది కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టింది. బిల్లు ప్రతిపాదిత సమయంలో గవర్నర్ ఆమోదం కోసం పంపగా, కొన్ని సందేహాలు లేవనెత్తారు. దీంతో, ఆ సమావేశాల్లో బిల్లు ఆమోదం లభిస్తుందా లేదా అనే ఉత్కంఠ ఏర్పడింది. గవర్నర్ అడిగిన సందేహాలను ప్రభుత్వం సమాధానం ఇవ్వటంతో రాజ్ భవన్ నుంచి బిల్లు అసెంబ్లీకి చేరుకుంది.

Telangana Governor Tamilsai has granted assent to the TSRTC Bill -2023

ఆ సమయంలోనే ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ వద్ద ధర్నా చేసారు. తరువాత కార్మిక సంఘాల నేతలు గవర్నర్ తో చర్చలు చేసారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. తిరిగి గవర్నర్ ఆమోదం కోసం పంపగా.. దీని పైన గవర్నర్ ఈ రోజున నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల ప్రాతినిధ్యాలు మరియు కార్పొరేషన్ యొక్క మొత్తం సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని గవర్నర్ చేసిన పది సిఫార్సులకు చేసినట్లు సమాచారం. తాను చేసిన 10 సిఫారసుల విష‌యంలో ప్ర‌భుత్వ స్పంద‌న‌పై సంతృప్తి చెందిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్న ఆర్టీసి కార్మికులకు గవర్నర్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+