Govt Employees: ఉద్యోగులకు రంజాన్ వెసులుబాటు.. గంట ముందే ఇంటికి..!
Govt Employees: తెలంగాణ ప్రభుత్వం ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పింది. రంజాన్ నెలలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గంట ముందు తమ కార్యాలయాలు, పాఠశాలల నుంచి ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. ముస్లిం సోదరులకు ఈ అవకాశం కల్పిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది మార్చి 2 నుంచి మార్చి 31,2025 వరకు వర్తిస్తుంది. ఇది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, బోర్డు, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకు ఇంటికి బయలుదేరవచ్చు.
పవిత్ర రంజాన్ మాసం అంతా ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకు కార్యాలయాలు, పాఠశాలల నుంచి బయటకు వెళ్లడానికి అనుమతిని ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా రోజుల్లో అత్యవసర పరిస్థితుల వల్ల వారు తప్పనిసరిగా హాజరుకావల్సి వస్తే తప్ప.. గంట ముందే వెళ్లిపోవడానికి సర్కారు అనుమతి ఇచ్చింది.

పవిత్ర మాసం ప్రారంభ తేదీ
భారత్ లో పవిత్ర మాసమైన రంజాన్ ప్రారంభ తేదీని నిర్ణయించడానికి సదర్ మజ్లిస్-ఎ-ఉలమా-ఎ-డెక్కన్ కు చెందిన సెంట్రల్ రూట్-ఎ-హిలాల్ కమిటీ లేదా చంద్ర దర్శన కమిటీ భారతదేశంలో తన నెలవారీ సమావేశాన్ని నిర్వహించనుంది. రంజాన్ నెలవంక దర్శనం ఆధారంగా ఇది నిర్ణయించబడుతుంది. మరోవైపు రంజాన్ పవిత్ర మాసానికి హైదరాబాద్ సిద్ధమవుతోంది. పవిత్ర మాసంలో వ్యాపారానికి చాలా మంది వ్యాపారలు సిద్ధమవుతున్నారు. పవిత్రమాసంలో ముస్లిం సోదరుల సౌలభ్యం కోసం నగరంలోని మసీదులు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రంజాన్ సందర్భంగా ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గంట సడలింపును ప్రకటించింది.












Click it and Unblock the Notifications