వీరి రేషన్ కార్డులు రద్దు, ప్రభుత్వం అనూహ్య నిర్ణయం..!!
రేషన్ కార్డుల పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అనర్హులు రేషన్ కార్డులు పొందినట్లు క్షేత్ర స్థాయిలో గుర్తించారు. ఇప్పుడు ఇలాంటి వాటి పైన పరిశీలన మొదలైంది. ఇటీవల విచారణ లో లక్షమందికిపైగా అనర్హులను గుర్తించి రేషన్ కార్డు రద్దు చేశారు. అయితే అనర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు కార్డులు ఉంటే కొనసాగించాలని.. అర్హత లేకపోయినా కార్డులు పొంది ఉంటే వాటిని రద్దు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వారికి నోటీసులు జారీ చేసి నోటీసు ప్రక్రియ పూర్తి చేయాలని డిసైడ్ అలయ్యారు.
కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల్లో అనర్హులను తెలిగిస్తోంది. క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు పరిశీలన ప్రారంభించారు. ప్రధానంగా హైదరాబాద్‌లో దాదాపు 2 లక్షల మంది ఐటీ చెల్లింపుదారులు రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టీజీ విజిలెన్స్ విభాగం రహస్య ఆడిట్‌లో ఈ విషయం బయటపడింది. దీంతో వీరి రేషన్ కార్డులను రద్దు చేయడంతో పాటు ఇప్పటివరకు పొందిన సబ్సిడీలను రికవరీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాన్ కార్డు, జీఎస్టీ నెంబర్లను రేషన్ కార్డు డేటాతో లింక్ చేశారు. దీంతో నగరంలో దాదాపు 2 లక్షల మంది ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ రేషన్ కార్డు పొందుతున్నట్లు వెల్లడైంది. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు, ఐటీ చెల్లింపుదారులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో గుర్తించారు. అనంతరం అనర్హుల డేటా బయటకు వచ్చింది. దాదాపు 80 శాతం వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవ్వగా.. త్వరలో మిగతా విచారణ పూర్తి చేయనున్నారు.

అర్హత లేని వారి కార్దుల ఏరివేత
అనర్హులుగా గుర్తించిన వారికి రేషన్ నిలిపివేసారు. అదే విధంగా ఆదాయపు పన్ను చెల్లించే వారికి రేషన్ కార్డులను రద్దు చేయాలని కేంద్రం డిసైడ్ అయింది. ఫిర్యాదుల వచ్చిన వారి వివరాలను ఆధార్, పాన్ వివరాలను ఇన్‌కమ్ ట్యాక్స్ డేటా సాయంతో పరిశీలిస్తోంది. అనంతరం వారి ఆర్ధిక స్తోమతను అంచనా వేసి కార్డుల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. ఇక ఖరీదైన వాహనాలు కలిగి ఉన్నవారిని కూడా లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇక మరణించిన వ్యక్తుల పేర్లపై ఉన్న కార్డులను కూడా తొలగించే ప్రక్రియ ప్రారంభించారు. ఇక పీఎం కిసాన్ డేటా ప్రకారం 52 వేల మందికిపైగా ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు గుర్తించారు. రేషన్ కార్డులకు పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామాల్లో రూ.1.50 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులుగా నిర్దారించారు. దీంతో, అర్హతలకు విరుద్దంగా కార్డు పొందిన వారిని గుర్తించి.. వారి కార్డులు రద్దు చేసే విధంగా వేగంగా అడుగులు పడుతున్నాయి.












Click it and Unblock the Notifications