కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!
తెలంగాణ ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. తమ ప్రాధాన్యత లను వెల్లడించింది. రూ.3లక్షల 24 వేల 234 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదించగా, అందు లో రెవెన్యూ వ్యయం రూ.2 లక్షల 34 వేల 406 కోట్లు గా పేర్కొన్నారు. మూలధన వ్యయం రూ. 47వేల 267 కోట్లుగా అంచనా వేసారు. ఇక.. ఈ బడ్జెట్ లో విద్యార్ధులకు కొత్త పథకాలను ప్రకటన చేసిన ప్రభుత్వం.. వచ్చే ఆర్దిక సంవత్సరంలో రెండు లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు భట్టి వెల్లడించారు.
డిప్యూటీ సీఎం భట్టి ప్రతిపాదించిన బడ్జెట్ లో అనేక కీలక అంశాలను ప్రతిపాదించారు. అందులో భాగంగా 2026-27 వార్షిక సంవత్సరంలో రాష్ట్రంలో అర్హులైన రెండు లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై రాష్ట్రంలో ఇంటర్ చదివే విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అమలు చేయనున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారు. విద్యార్థులకు సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా మని డిప్యూటీ సీఎం వివరించారు.

అదే విధంగా అలాగే ఐఐటీ, ఏటీసీఎల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2వేల స్కాలర్‌షిప్ అందించనున్నట్టు ప్రకటించారు. దీంతో పాటుగా ఆరు గ్యారంటీల కు రూ.50,713 కోట్లు కేటాయించారు. ఇక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా పథకం అమలు కోసం రూ.18 వేల కోట్లు కేటాయింపులు చేసారు.
శాఖల వారీగా కేటాయింపులు
ఇక, చేయూత - రూ.14,861 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఇందిరమ్మ ఇళ్లు - రూ.5,500 కోట్లు, మహాలక్ష్మి పథకం - రూ.4,305 కోట్లు, వడ్ల బోనస్ - రూ.3,500 కోట్లు, గృహజ్యోతి - రూ.2,080 కోట్లు, ఆరోగ్య శ్రీ - రూ.1143 కోట్లు, LPG సబ్సిడీ - రూ.723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా - రూ.600 కోట్లు, విద్యుత్ సబ్సిడీ - రూ.14 వేల కోట్లు, బియ్యం సబ్సిడీ - రూ.3 వేల కోట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ - రూ.3,683 కోట్లు, విద్యార్థుల మెస్ ఛార్జీలు - రూ.2,170 కోట్లు, స్కాలర్‌షిఫ్‌లు - రూ.4,343 కోట్లు, ఎస్‌డీఎఫ్ - రూ.3,300 కోట్లు ప్రతిపాదన లు చేసారు.
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీకి రూ.400 కోట్లు, మిషన్ భగీరథ నిర్వహణ - రూ.400 కోట్లు, నేతన్నలకు సాయం - రూ.450 కోట్లు, ఎంబీసీ అభివృద్ధి కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు, పావలా వడ్డీ స్కీమ్‌కు రూ.350 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ - రూ.344 కోట్లు పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతికశాఖ - రూ.1049 కోట్లు కేటాయింపులు చేసారు.












Click it and Unblock the Notifications