రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. రైతుల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఈ నిధులను సీఎం రేవంత్ విడుదల చేసారు. మూడు విడతల్లో పూర్తి స్థాయిలో నిధులు అర్హత ఉన్న ప్రతీ రైతు ఖాతాలో జమ అవుతాయని వెల్లడించారు. అందరికీ ఒక ఎకారిని రూ 6 వేలు వారి ఖాతాల్లో జమ చేసారు. నిర్దేశించిన సమయం మేరకు రెండు, మూడు విడతల్లో పూర్తి స్థాయిలో ఈ నిధులు జమ కానున్నాయి. అయితే, తొలి విడత నిధులు జమ కాని రైతులకు అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హత కలిగిన లబ్దిదారులందరికీ తొలి ఎకరానికి రూ.6 వేలు జమ చేయగా.. రెండు, మూడు విడతల్లో అన్ని ఎకరాలకు అందించనున్నారు. నిధులు విడుదల చేసినా.. ఆదివారం బ్యాంకుల కు సాధారణ సెలవు కావడంతో సోమవారం లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. కాగా, ఇదే సమయంలె అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకుంటే.. స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇక మండల వ్యవసాయ అధికారిని కలిసి ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే విధంగా అర్హల జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవటంతో పాటుగా బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ అయిందా..? లేదా..? బ్యాంక్ కేవైసీ యాక్టివ్‌లో ఉందా..? లేదా? అనే వివరాలు పరిశీలన చేయాలని సూచన చేస్తున్నారు. అదే విధంగా పాస్ బుక్ వివరాలు ధరణి పోర్టల్‌లో చెక్ చేసుకుని రిజిస్టర్ అయ్యాయా..? లేదా? అనే డీటైల్స్ తనిఖీ చేయటం అవసరమని పేర్కొన్నారు.

telangana-govr-credited-rythu-bharosa-first-phase-funds-to-the-eligible-farmers-accounts-key-sugges

కాగా, కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన సమయంలో సకాలంలో రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. గడువులోగా చేసుకోకపోతే డబ్బులు పడవని చెబుతున్నారు. నగదు జమ కాని రైతులు తమ స్థానిక అధికారులను అడిగి సమస్యను పరిష్కరించుకుంటే తర్వాతి విడతలో డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేసారు. ఎవరికైనా సాంకేతిక సమస్యలతో నగదు జమ కాకుంటే అధికారుల కు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని వెల్లడించారు. ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు తప్పనిసరి చేసారు. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ది పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో రిజిస్ట్రర్ అయి ఉండాలి. లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం తొలి ఎకరానికి ప్రభుత్వం రైతు భరోసా అందిస్తోంది. ఎన్ని ఎకరాలు ఉన్నవారికైనా సరే తొలి ఎకరానికి రూ.6 వేలు తొలి విడతలో పొందనున్నారు. లబ్దిదారులందరీ అకౌంట్లలో రూ.6 వేల జమ కానున్నాయి. రైతు భరోసా అందనివారు అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచిస్తోంది. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకం అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+