తెల్ల రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కారు గుడ్‌న్యూస్
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించిన కార్యకలాపాలపై ఉన్నతస్థాయి సమీక్షచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల వాగ్ధానంలో ఈ పథకం అత్యంత కీలకమని ఉత్తమ్ చెప్పారు. నాణ్యమైన బియ్యం వినియోగదారులకు అందించడం ప్రాధాన్యం అని అన్నారు. అవసరమైన చోట రాయితీ ధరలకు గోధమలు కూడా సరఫరా చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పీడీఎస్ బియ్యం దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రేషన్ డీలర్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించి వారికి ప్రోత్సహకాలు అందజేస్తుందని హామీ ఇచ్చారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తే డీలర్‌షిప్ రద్దు చేస్తామని గట్టిగా హెచ్చరించారు. చౌక ధరల దుకాణాల్లో 1629 ఖాళీలు ఉన్నాయని తెలుసుకున్న మంత్రి ఉత్తమ్.. వెంటనే వాటిని భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ సమస్యలపై 10 రోజుల్లో సమగ్ర నివేదిక అందజేస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ మంత్రి ఉత్తమ్‌కు తెలిపారు.
మరోవైపు, రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న బియ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. న్యూట్రిషన్ రైస్ నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు నిర్ణీత పరిమాణం, ఉత్తమ నాణ్యతగా అందేలా తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అంత్యోదయ కార్డుల సంఖ్య పెంచే అవకాశాలు పరిశీలించాలన్నారు.
మహాలక్ష్మి పథకంకి సంబంధించి 500 రూపాయలుకే గ్యాస్ సిలిండర్లు అందజేసేందుకు పౌర సరఫరాల శాఖకు విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. లబ్ధిదారులందరికీ మెసేజ్‌లు పంపి బెలూన్లు, ఇతర ప్రచార సామాగ్రిని వినియోగించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications