తెలంగాణ గేమ్ ఛేంజర్..!!

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సమ్మిట్ కు తరలిరండి- ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి.. అనే నినాదాన్ని ఖరారు చేసింది ప్రభుత్వం. దీనికి ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనుందీ సమ్మిట్

దీనిపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించిన ఆయన ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ఇందుకోసం దేశ విదేశాలకు చెందిన దాదాపు 3,000 మంది ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవుతున్నారు.

Telangana Govt gear up Rising Global Summit

UAE రాజవంశానికి చెందిన ఎమిరేట్స్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్ డైరెక్టర్ షేఖ్ తారిక్ బిన్ ఫైజల్ అల్ ఖసిమి, రస్ అల్ ఖైమా ప్రతినిధులు డుయిష్ బోర్సే, గ్రూప్ హెడ్ లుడ్విగ్ హెంజిల్మెన్, ఎన్రిషన్ వ్యవస్థాపక భాగస్వామి విన్ స్టన్, మాండయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈఓ బెన్నెట్ నియోతో పాటు పలు టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొనడానికి ఇప్పటికే సంసిద్ధతను తెలియజేశారు.

2047 నాటికి వికసిత్ భారత్- జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం 'తెలంగాణ రైజింగ్ 2047' దార్శనిక పత్రం తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు తెలంగాణకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. ఈ లక్ష్యాలను.. ప్రభుత్వం సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడానికి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నామని, దీనికి తప్పకుండా తరలిరావాలని పేరిట ఈ ఆహ్వాన లేఖలు పంపించారు.

తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించడం, పెట్టుబడులకు గమ్యస్థానంగా రూపొందిన ఇక్కడి వాతావరణం, విధానాలు, స్పష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధి సాధన అంశాలను ఈ వేదికగా చాటి చెప్పాలని ప్రభుత్వం సంకల్పించింది. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. ఈ నెల 13న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లయనెల్ మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన పాల్గొనే వేడుకలోనే ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌ నిర్వహిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలువనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+