హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రతి ఇంటికీ తాగునీరు: కెసిఆర్ సమీక్ష(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని ప్రతీ ఇంటికీ తాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఎల్లంపల్లి నుంచి గోదావరి, శ్రీశైలం నుంచి కృష్ణా నదుల నీటిని హైదరాబాద్‌కు తరలించడానికి అధ్యయనం చేయాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరాపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రస్తుతం కృష్ణా ద్వారా 11 టిఎంసిలు, సింగూరు నుంచి 7 టిఎంసిలు, గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి రెండు టిఎంసిలు మొత్తంగా 20 టిఎంసిలను మాత్రమే ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత జనాభా, ఇతర అవసరాల కోసం 35 టిఎంసిల నీరు అవసరం అవుతుందని అన్నారు. హైదరాబాద్ ప్రస్తుత జనాభా కోటి కాగా, దాదాపు ప్రతి రోజు 10 లక్షల మంది జనం నగరానికి వచ్చివెళ్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అదేవిధంగా ఏటా నగర జనాభా పెరుగుతోందని, ఐటిఐఆర్ ప్రాజెక్టు, పారిశ్రామిక విధానం వల్ల కొత్తగా రానున్న పరిశ్రమలతో భవిష్యత్‌లో జనాభా మరింతగా పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్‌లో పెరగబోయే జనాభాతో పాటు పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు, రైల్వేలు, విద్యాసంస్థలు, ఎయిర్‌పోర్టు తదితర అవసరాలను తీర్చడానికి తాగునీటి సరఫరా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.

ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ తాగునీటి పైపులేన్లు వేయడం వల్ల నగరానికి ఎక్కడి నుంచైనా నీటిని సరఫరా చేసుకోవడంతో పాటు, అవుటర్ రింగ్‌కు అవతల వైపున అభివృద్ధి చెందే ప్రాంతాలకూ తాగునీరు సరఫరా చేసుకునే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు. గోదావరి, కృష్ణా ద్వారా హైదరాబాద్‌కు నీటి సరఫరా చేసే యంత్రాంగం పటిష్టంగా ఉండాలని అన్నారు. తాగునీటి సరఫరాతో పాటు నగరంలో వర్షపు నీరు రహదారులపై నిలువకుండా అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్‌కు రూ. 100 కోట్లను తక్షణం విడుదల చేయనున్నట్టు సిఎం కెసిఆర్ ప్రకటించారు.

కెసిఆర్ సమీక్ష

కెసిఆర్ సమీక్ష

నగరంలోని ప్రతీ ఇంటికీ తాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.

కెసిఆర్ సమీక్ష

కెసిఆర్ సమీక్ష

ఎల్లంపల్లి నుంచి గోదావరి, శ్రీశైలం నుంచి కృష్ణా నదుల నీటిని హైదరాబాద్‌కు తరలించడానికి అధ్యయనం చేయాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

కెసిఆర్ సమీక్ష

కెసిఆర్ సమీక్ష

హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరాపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

కెసిఆర్ సమీక్ష

కెసిఆర్ సమీక్ష

ప్రస్తుతం కృష్ణా ద్వారా 11 టిఎంసిలు, సింగూరు నుంచి 7 టిఎంసిలు, గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి రెండు టిఎంసిలు మొత్తంగా 20 టిఎంసిలను మాత్రమే ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao on Monday directed officials to take steps to meet the drinking water needs in Hyderabad by taking into account the present and future population of the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X