రైతులకు శుభవార్త.. వారి ఖాతాల్లో 9600రూపాయలు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. రైతులను వివిధ పంటలను సాగు చేయడానికి అన్ని విధాల ప్రోత్సహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల సాగును గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూరగాయల సాగు చేసే వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది.
కూరగాయలు సాగుచేసే రైతులకు శుభవార్త
కూరగాయలు సాగు చేసే రైతులకు ఎకరానికి 9600 రూపాయల సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ మేరకు ఉద్యానవన శాఖను ఆదేశించారు. 2025 - 26 ఆర్థిక సంవత్సరంలో పదివేల ఎకరాలలో కూరగాయల సాగును ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక లక్ష 35 వేల ఎకరాలలో ఏటా 14లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తి జరుగుతుంది.

కూరగాయల సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వ ప్రణాళిక
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వే ప్రకారం రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నుల కూరగాయలు అవసరమవుతాయి. ఈ లోటును పూరించడానికి అదనంగా 1.33 లక్షల ఎకరాలలో 12.68 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలోనే ప్రతి సంవత్సరం అదనంగా పదివేల ఎకరాలలో కూరగాయల సాగును చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది.
రైతులకు సమీకృత ఉద్యాన మిషన్ పథకం కింద ఆర్ధిక సాయం
ఈ బృహత్తర కార్యక్రమం కోసం సమీకృత ఉద్యాన మిషన్ పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందించడానికి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇందులో భాగంగా ఎకరం సాగుకు అయ్యే ఖర్చును అంచనా వేసే క్రమంలో 40 శాతం రైతుల ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు.
పెట్టుబడిలో 40శాతం సబ్సిడీ
ఉద్యానవన శాఖ అంచనాల ప్రకారం ఒక ఎకరంలో కూరగాయల సాగు చేయాలంటే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు, సస్యరక్షణ, పోషక యాజమాన్యం ఇలా సుమారు 24 వేల రూపాయలు ఖర్చవుతుంది. ఇందులో 40 శాతం అంటే 9600 రూపాయల సాయం ప్రభుత్వం నుంచి అందించాలని నిర్ణయించారు. ఈ డబ్బులు నేరుగా కూరగాయల సాగు చేసే రైతుల ఖాతాలలో జమవుతాయి.
9600 రూపాయలు నేరుగా వారి ఖాతాలలో
ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని కూరగాయలను సాగు చేయాలనుకునే రైతులు ఉద్యాన శాఖాధికారులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇందులో ఎంపికైన రైతులకు సాగు ప్రారంభించిన వెంటనే ఉద్యాన శాఖ నుండి లేదా గుర్తింపు పొందిన నర్సరీల నుండి విత్తనాలు, నారు కొనుగోలు చేస్తే 40 శాతం సబ్సిడీ సాయంగా అందిస్తారు. దీంతో 9600 రూపాయలు నేరుగా వారి ఖాతాలలో జమవుతాయి. ఒక్కో రైతుకు గరిష్టంగా రెండున్నర ఎకరాల వరకు సబ్సిడీ సహాయం అందుతుంది. ఇది నిజంగా కూరగాయల సాగు చేయాలనుకునే రైతులకు శుభవార్త అనే చెప్పాలి.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications