కేసీఆర్ దూకుడు: వారికి రూ.లక్ష ఆర్థిక సాయం: కుటుంబంలో ఒక్కరికే- జీఓ జారీ
హైదరాబాద్: తెలంగాణ.. అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి.. ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గురి పెడుతోంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.
ఇందులో భాగంగా- ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. వారికి అందజేస్తోన్న పింఛన్ మొత్తాన్ని భారీగా పెంచింది. ప్రస్తుతం అందుతోన్న 3,016 పింఛన్ మొత్తానికి మరో 1,000 రూపాయలను జత చేసింది. 4,016 రూపాయలకు పెంచింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.

వృద్ధులు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలకు ఆర్థిక చేయూతను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీనికింద ఆయా వర్గాల వారందరికీ సామాజిక భద్రత కింద పింఛన్‌ను అందజేస్తోంది. బీడి కార్మికులకు కూడా దీన్ని వర్తింపజేసింది. ప్రస్తుత నెల నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.
దీనికి సంబంధించిన జీఓ జారీ అయిన మరుసటి రోజే సీఎం కేసీఆర్ మరో సంచలన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో అర్హులైన మైనారిటీలందరికీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. బీసీల తరహాలో రాష్ట్రంలో నివసించే అర్హులైన మైనారిటీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తోన్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు మైనారిటీల సంక్షేమ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ జీఓ నంబర్ 78ను జారీ చేశారు. వందశాతం సబ్సిడీతో లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మైనారిటీలకు అందజేస్తుంది. ఇది వన్ టైమ్ గ్రాంట్. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ ఆర్థికసాయం అందుతుంది.
దరఖాస్తు చేయాలనుకునే వారి వార్షిక ఆదాయం .. గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర, పట్టణాల్లో రెండు లక్షల రూపాయలకు మించి ఉండకూడదు. తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద అర్హులైన వారికి ఆర్థిక సాయం అందుతుంది. ఎంపిక చేసిన వారి జాబితాను మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతుంది ప్రభుత్వం.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications