చేయూత ఫించను తక్షణం మంజూరు, వీరికే - ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేయూత పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు శుభవార్త అందించింది. చాలా కాలంగా కొత్త ఫించన్ల మంజూరు కోసం అర్హులైన లబ్దిదారులు వేచి చూస్తున్నారు. దరఖాస్తులు స్వీకరించారు. అందులో అర్హులను గుర్తించారు. దసరా నుంచే కొత్త ఫించన్లు మంజూరు చేస్తారని భావించారు. కాగా.. ఇప్పుడు చేయూత ఫించన్ల పైన ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ కేటగిరీలో వారికి తక్షణం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

చేయూత పింఛన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. చేయూత పింఛను పొందుతున్న భర్త మరణిస్తే వెంటనే భార్యకు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇన్‌స్టంట్ చేయూత పింఛను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్య పింఛన్లకు అమలవుతున్న విధానం మిగతా కేటగిరీలకు వర్తించనుంది. దివ్యాంగులు, గీత, చేనేత కార్మికు లు, డయాలసిస్, హెచ్‌ఐపీ, ఫైలేరియా చేయూత పింఛన్లకు వర్తించనుంది. పింఛను పొందుతున్న భర్త మరణిస్తే అతడి భార్యకు ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే ఆ స్థానంలో పింఛను మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కేవలం వృద్ధాప్య పింఛను అందుకునే భర్త మరణిస్తేనే అతడి భార్యకు తక్షణమే పింఛను బదిలీ చేసేవారు.

TTDకి నూతన పాలక వర్గం- కొత్త ఛైర్మన్, సభ్యులుగా..!?
TTDకి నూతన పాలక వర్గం- కొత్త ఛైర్మన్, సభ్యులుగా..!?
telangana-govt-issues-key-orders-on-cheyutha-pensions-ensures-immediate-pension-for-wives

ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు

కాగా, తాజా ఉత్తర్వుల మేరకు ఇతర కేటగిరీలకు ఈ విధానం అమలు కానుంది. పింఛన్‌దారులు మరణిస్తే వారి భార్యలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దృష్టికి వెళ్లడంతో, వెంటనే నిబంధనలు సవరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. పింఛను పొందుతున్న వ్యక్తి మరణించిన సమయానికి భార్య వయస్సు ఆధారంగా పింఛను కేటగిరీని నిర్ణయిస్తారు. భర్త చనిపోయేనాటికి భార్య వయస్సు 57 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే ఆమెకు వితంతు పింఛను మంజూరు చేస్తారని అధికారులు వెల్లడించారు. ఒకవేళ ఆమె వయస్సు 57 సంవత్సరాలు లేదా ఆ పైన ఉంటే వృద్ధాప్య పింఛను కింద క్రమం తప్పకుండా డబ్బులు అందిస్తారని స్పష్టం చేసారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు తమ పరిధిలోని పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు అందజేయాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉండేవారు సంబంధిత బిల్ కలెక్టర్‌కు తమ అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+