డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!!
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో లబ్ది దారులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే అర్హులైన పేదలకు డబుల్ ఇల్ల రూం ఇళ్ల పంపిణీ పై ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. కొన్ని నిర్మాణాలు పూర్తైనా లబ్దిదారులకు ఇప్పటికీ అందించలేదు. మరికొన్ని అసంపూర్తి దశలోనే ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
డబుల్ బెడ్ రూం ఇళ్ల పైన ప్రభుత్వం తాజాగా అధికారులకు స్పష్టత ఇచ్చింది. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయటంతో పాటుగా పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా, త్వరలో 18,579 డబుల్ బెడ్ రూం ఇళ్ల పనులను పూర్తి చేసి పేదలకు కేటాయించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వీటిని పట్టణాల్లోని పేదలకు అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. పట్టణాల్లోని పేదలు డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. పట్టణాల్లోని పేదలకు వారు ఉండే సమీప ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. అర్హులకు ఇళ్లు రాకపోతే తమ వివరాలు అందించాలని, ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. శాసనమండలిలో పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు పొంగులేటి సమాధానమిచ్చారు. త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తి చేసి పేదలకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం తాజా నిర్ణయం.. మార్గనిర్దేశం
కాగా, ఇదే సమయంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ లేదా మే నెలల్లో రెండో విడత ఇళ్ల కేటాయింపులు ఉంటాయని తెలిపారు. ఇళ్ల మంజూరు ప్రక్రియ అనేది నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. గతంలో మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ఆర్ధిక సమస్యలు ఎదురైతే వచ్చే ఏడాది పథకంలో నిధులు కేటాయిస్తామన్నారు. తొలి విడతలో జారీ అయిన ఇళ్లల్లో జులై నాటికి 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలను వేగంతం చేసే ప్రక్రియ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో హైదరాబాద్ లోనూ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పైన ప్రభుత్వం కార్యాచరణ ఖరారు చేసింది. త్వరలోనే పంపిణీ చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటంతో... ఎంతో కాలంగా వేచి చూస్తున్న లబ్దిదారులకు ఇళ్లు అందనున్నాయి.












Click it and Unblock the Notifications