రూ 4 వేల పెన్షన్, మహిళల ఖాతాల్లో రూ 2500 - బిగ్ అప్డేట్..!!

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఇదే పూర్తి స్థాయి బడ్జెట్. 2.91 లక్షల కోట్లతో ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తరువాత సంక్షేమానికి కేటాయింపులు పెంచారు. ఇదే సమయంలో రైతు రుణమాఫీ అమలు గురించి భట్టి స్పష్టత ఇచ్చారు. కానీ, పెన్షన్ రూ 4 వేలకు పెంపు, మహిళల ఖాతాల్లో రూ 2500 జమ ప్రస్తావన లేదు. దీంతో, వీటి అమలు పైన కొత్త చర్చ మొదలైంది.

బడ్జెట్ ప్రతిపాదనలు
తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191కోట్ల ప్రతిపాదనలో ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రతిపాదించారు. తెలంగాణ ఏర్పాటు నాటికి 75577కోట్ల అప్పు ఉండగా..ఈ ఏడాది డిసెంబర్ 6లక్షల 71 వేల కోట్ల కు చేరిందని వెల్లడించారు. తాము హామీ ఇచ్చిన విధంగా రైతులకు రుణమాఫీ అమలు చేస్తున్న అంశాన్ని భట్టి వివరించారు. రూ 2 లక్షల వరకు మాఫీ అమలు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం తొలి సారి బడ్జెట్ లో రూ 10 వేల కోట్లు ప్రతిపాదించారు. కాంగ్రెస్ సూపర్ సిక్స్ హామీల అమలు నిధులను ప్రస్తావించారు.

Telangana Govt likely to implement pensions hike from next financial year

హామీల అమలు
మహిళలకు ఉచిత బస్సు పథకం కొనసాగింపు కోసం రూ 723 కోట్లు ప్రతిపాదించారు. వంట గ్యాస్ సిలిండర్ల పథకం గృహజ్యోతి కోసం రూ 2,418 కోట్లను భట్టి బడ్జెట్ లో కేటాయించారు. ఇక..ప్రజాపంపిణీ వ్యవస్థ- 3,836 కోట్లు..పంచాయతీ రాజ్-29,816కోట్లు, ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం-17,000 కోట్లు, వైద్య ఆరోగ్యం-11,468 కోట్లు ప్రతిపాదించారు. విద్యుత్-16,410 కోట్లు..నీటి పారుదల -22,301 కోట్లను బడ్జెట్ లో ప్రతిపాదించారు. కానీ, ఈ సారి బడ్జెట్ లో అమలు చేయాల్సిన ఉన్న మరో రెండు కీలక హామీల గురించి ప్రస్తావన చేయలేదు.

వచ్చే ఏడాదేనా
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు రూ.2500 అందుతాయని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ పథకం అమలు పైన బడ్జెట్ లో ప్రస్తావన లేదు. అదే విధంగా పెన్షన్ రూ 4 వేలకు పెంపు పైనా ప్రభుత్వం నుంచి ప్రకటన లేదు. రైతు రుణమాఫీ తరువాత పెన్షన్ పెంపు పైన నిర్ణయం తీసుకుంటామని గతంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని ద్వారా..ఈ రెండు పథకాలకు వచ్చే ఆర్దిక సంవత్సరంలోనే నిధులు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+