హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు ఊహించని వరం, ఇక నుంచి కొత్తగా..!!
హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు బిగ్ అప్డేట్. ఐటీ కారిడార్ కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ కష్టాల నుంచి ఐటీ ఉద్యోగులకు విముక్తి కలిగించేలా వినూత్న అడుగు ముందుకు వేసింది. ఐటీ కారిడార్ ప్రయాణికుల కోసం పాడ్ టాక్సీ లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ అధ్యయనానికి నోటిఫికేషన్ జారీ చేసింది. రాబోయే కొద్ది నెలల్లోనే ఈ డ్రీమ్ ప్రాజెక్టు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో కొత్త రవాణా వ్యవస్థ అందుబాటులోకి రానుంది. మెట్రో ప్రయాణికులకు చివరి మైలు సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం 'పాడ్ ట్యాక్సీ'లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (పీఆర్‌టీ) పేరుతో తీసుకురానున్న ఈ వ్యవస్థ మెట్రో స్టేషన్లను నేరుగా ప్రధాన కార్యాలయాలు, ఐటీ హబ్‌లు, నివాస ప్రాంతాలతో అనుసంధానించనుంది. ఐటీ కారిడార్ ప్రయాణికుల కోసం పాడ్ టాక్సీ లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇవి రోడ్డుపై కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎలివేటెడ్ ట్రాక్‌లపై నడుస్తాయి. ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో చేపట్టబోతున్నారు. దీనికోసం ఎంపికైన కన్సల్టెంట్ సంస్థ 120 రోజుల్లో సాధ్యాసాధ్యాల నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రాబోయే కొద్ది నెలల్లోనే ఈ డ్రీమ్ ప్రాజెక్టు కార్యరూపం దాల్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

తొలిగా ఐటి కారిడార్ లో ప్రారంభం
కాగా, తొలి దశలో అందుబాటులోకి తేవాల్సిన మార్గాల పైన ఒక అంచనాకు వచ్చారు. తొలి దశలో ఈ పాడ్ టాక్సీలను రాయదుర్గం - కూకట్‌పల్లి మార్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సిటీ, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ పరిసరాలు, కొత్త సచివాలయం వంటి రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే విధంగా కసరత్తు చేస్తున్నారు. ఇవి పూర్తిగా ఆటోమేటెడ్, అంటే డ్రైవర్ అవసరం లేకుండా కంప్యూటర్ నియంత్రణ ద్వారా నడుస్తాయి. బ్యాటరీ లేదా విద్యుత్‌తో నడవడం వల్ల శబ్ద కాలుష్యం గానీ, వాయు కాలుష్యం గానీ ఉండదు. ఒక్కో పాడ్‌లో 6 నుంచి 8 మంది కూర్చునే వీలుంటుంది. గంటకు సుమారు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, గంటకు 10 వేల మందిని గమ్య స్థానా లకు చేర్చే సామర్థ్యం వీటికి ఉంటుంది. మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడే యాప్ ద్వారా పాడ్ టాక్సీని బుక్ చేసుకుంటే, స్టేషన్ చేరుకునే సరికి టాక్సీ సిద్ధంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాల నుంచి శాశ్వత విముక్తి లభిస్తుంది.












Click it and Unblock the Notifications