ఇంటర్ విద్యార్ధులకు ప్రభుత్వం భారీ కానుక, ఇక నుంచి..!!
ఇంటర్ విద్యార్ధులకు ప్రభుత్వం భారీ కానుక ప్రకటించింది. ఇంటర్ జూనియర్ విద్యార్ధుల కోసం కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఈ ఏడాది నుంచి కొత్తగా ఈ నిర్ణయం అమలు కానుంది. విద్యార్ధులకు ఉపయోగపడే విధంగా తీసుకున్న ఈ నిర్ణయం అమలు దిశగా కసరత్తు జరుగుతోంది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న కొత్త విద్యా సంవత్సరం వేళ నుంచి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు కానుంది.
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్ధుల కోసం కొత్త కానుక సిద్దం చేస్తోంది. ఇంటర్ విద్యార్ధులకు వెల్కమ్ కిట్ అందజేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అంద జేసింది. విద్యార్ధులకు ఉపయోగపడే విధంగా యూనిఫాం, నోట్స్, లెసన్, వర్క్ బుక్స్ అందజేయ నున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే జూన్ 1న తరగతుల ప్రారంభం రోజే వాటిని విద్యార్థు లకు అందించేందుకు ఇంటర్ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందు కోసం దాదాపు రూ 70 కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర శిక్షా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అమలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా వాటిలో ప్రస్తుతం చదువుతున్న 1.80 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఈ కిట్ ద్వారా లబ్ధి పొందనున్నారు.

వచ్చే ఏడాది నుంచి అమలు
అయితే, విద్యార్థులకు కిట్స్ అందించాలన్న ప్రతిపాదనకు అధికారికంగా ఆమోదం లభిస్తే.. వెంటనే టెండర్లు జారీ చేసే కాలేజీలు రీ ఓపెన్ అయ్యే సమయానికి కిట్లు సిద్దం చేయాలని అధికారులు భావిస్తున్నారు. గురుకుల జూనియర్ కళాశాలల్లో చదివే వారికి సర్కారు ఇప్పటికే ఏకరూప దుస్తులను అందిస్తున్నారు. అయితే, ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థులకు మాత్రం అందటం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్ధుల తల్లి తండ్రుల పైన భారం లేకుండా ఉండేలా ఈ ప్రతిపాదనలు చేసారు. ఈ వెల్ కం కిట్స్ ద్వారా ఇంటర్ విద్యార్థులకు సైతం రెండు జతల యూనిఫామ్ దుస్తులు, పలు రకాల పుస్తకాలను అందించనున్నారు. అందులోనే పాఠ్య పుస్తకాలు.. నోట్ బుక్స్ ఇవ్వనున్నారు. ఇదే సమయంలో పీఎం పోషణ్ (మధ్యాహ్న భోజన పథకం)కు రూ.12,750 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.250 కోట్లు మాత్రమే అధికం గా ఉంది.












Click it and Unblock the Notifications