తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ - ప్రభుత్వం కీలక నిర్ణయం...!!
తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ రాబోతోంది. ఏపీలో 2019 లో జగన్ సీఎం అయిన తరువాత వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవ లకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రభుత్వ నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో అమలు చేయటంలో వారే కీలక భూమిక పోషించారు. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల వ్యవస్థను తొలిగించారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ ను కొన్ని ప్రత్యేక రంగా ల్లో వినియోగించుకోవాలని భావిస్తోంది.
ఏపీలో అమలైన వాలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పక్కన పెట్టింది. రాజకీయంగా వాలంటీర్ల వ్యవస్థ తో నష్టం జరుగుతుందనే అభిప్రాయం ఉంది. 2024 లో వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీ నేతలే తమ ఓటమికి వాలంటీర్ల వ్యవస్థే కారణమని ఓపెన్ గా విమర్శలు చేసారు. 2023 లో తెలంగాణలో అధికారంలోకి వచ్చని సమయంలో కాంగ్రెస్ నేతలు సైతం వాలంటీర్ల వ్యవస్థ పైన ఆలోచన చేసారు. ఏపీ ఫలితాలు చూసిన తరువాత ఆ ప్రతిపాదన ను పక్కన పెట్టారు. కాగా, ఇప్పుడు రైతులకు ఉపయోగపడేలా సాయిల్ హెల్త్ వాలంటీర్లను నియమించనున్నట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ముగ్గురు వాలంటీర్లను నియమిస్తారు. ఇలా రాష్ట్రంలో మొత్తం 30 వేల మంది వాలంటీర్లను ప్రభుత్వం నియమించనుంది. ఏపీలో అమలు చేసిన విధానంలో కాకుండా ప్రస్తుతానికి సాయిల్ హెల్త్ వాలంటీర్లుగా నియమించుకోవాలని నిర్ణయించారు.

ప్రస్తుతానికి వ్యసాయ రంగానికి పరిమితం
ఇక, ఈ సాయిల్ హెల్త్ వాలంటీర్లు తమకు కేటాయించిన పరిధిలో ఉన్న రైతులకు సహకారం అందించనున్నారు. భూసారం కాపాడుకోవటం.. పంటకు అనుకూలంగా భూమిని ఎలా మార్చుకో వాలి లాంటి సలహాలు, సూచనలు చేస్తారు. రైతులకు భూసారంపై అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి ఎలా రాబట్టాలనే దానిపై రైతులకు సూచనలు చేస్తారు. ముందుగా ఈ వాలంటీర్లకు వాటిపై ట్రైనింగ్ కల్పిస్తారు. ఇక్రిశాట్‌లో తాజాగా తొలి విడతగా వాలంటీర్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని తుమ్మల ప్రారంభించారు. ఇక్రిశాట్, తెలంగాణ వ్యవసాయ శాఖ ఈ వాలంటీర్లను నియమించనుంది. తొలుత సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎంపికైన వాలంటీర్లకు శిక్షణ అందిస్తున్నారు. వీరికి భూసారం, పంటల సాగు లాంటి అన్ని విషయాలపై ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ పూర్తయిన తరువాత వీరు విధుల్లోకి రానున్నారు.












Click it and Unblock the Notifications