తెలంగాణలోని స్కూళ్లపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

తెలంగాణలో బడి గంట మోగే సమయం అయింది. జూన్ 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఇక నుంచి నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ తరగతులను కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర శిక్ష పథకంలో భాగంగా 210 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. 2025-26 సంవత్సరానికి గాను విద్యార్థులను పాఠశాలల్లో చేర్చుకోవాలని స్పష్టం చేసింది.

2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో కీలక మార్పులను చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఇక నుంచి నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ తరగతులను కూడా నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ శాఖ అధికారులకు ఉత్తర్వలు జారీ చేసింది. సమగ్ర శిక్ష పథకంలో భాగంగా 210 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలని పేర్కొంది.

మరోవైపు తెలంగాణలో ఇవాల్టి నుంచి అంగన్ వాడీ కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. చిన్నారులకు తెలంగాణ ప్రభుత్వం, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. మొదటి రోజు ఎగ్ బిర్యానీని చిన్నారులు తిన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు తొలి రోజు పిల్లలకు ఎగ్ బిర్యానీ పెట్టారు. అంగన్ వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ పెట్టడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణలోని అంగన్ వాడీ కేంద్రాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ముఖ్యంగా చిన్నారుల ఆహారంపై ఫోకస్ పెట్టింది. చిన్నారుల మెనూ రోజూ ఒకే విధంగా కాకుండా సాధ్యమైన చోట, వీలున్నప్పుడల్లా చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందించాలని ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగానే తొలిరోజు ఎగ్ బిర్యానీ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.

Telangana Govt Schools to Introduce Nursery LKG and UKG Classes

అంగన్వాడీలో చిన్నారుల అడ్మిషన్లు, అటెండెన్స్‌ పెరగాలంటే మంచి నాణ్యమైన పౌష్టికాహారం, బలవర్థకమైన ఆహారం పెట్టడంతోనే సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మంచి ఫుడ్ పెట్టడం ద్వారా చిన్నారులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు మెనూ మారుస్తూ వెళ్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+