తెలంగాణలో 20మంది IPS అధికారుల బదిలీ
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏకంగా 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్. గజరావు భూపాల్ సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నుంచి బదిలీ అయి ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్ గా నియామకం అయ్యారు. అభిషేక్ మొహంతి విజిలెన్స్, ఎన్ ఫోర్స్‌మెంట్ డీఐజీగా బదిలీ అయ్యారు. అలాగే ఆర్ భాస్కరన్ సీఐ సెల్ ఎస్పీ నుంచి డీఐజీగా బదిలీ అయ్యారు. అలాగే చందనా దీప్తి.. రైల్వేస్ ఎస్పీ/డీఐజీ నుంచి ఫ్యూచర్ సిటీ అడిషనల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు.
తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
— Telugu Scribe (@TeluguScribe) January 17, 2026
వారాల వ్యవధిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తున్న ప్రభుత్వం pic.twitter.com/Gw6vaavBpi
త్వరలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఏకంగా 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. లాజిస్టిక్స్ ఐజీగా గజారావు భూపాల్, విజిలెన్స్ డీఐజీగా అభిషేక్ మహంతి బదిలీ అయ్యారు. అలాగే ఇంటెలిజెన్స్ డీఐజీగా ఆర్ భాస్కర్, ఫ్యూచర్ సిటీ అడిషనల్ సీపీగా చందనా దీప్తి బదిలీ అయ్యారు.

మరోవైపు తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను సైతం బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కొమురంభీం కలెక్టర్ గా కే. హరిత, ఫిషరీస్ డైరెక్టర్ గా కే. నిఖిల, విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా వెంకటేశ్ బదిలీ అయ్యారు. అలాగే యాదాద్రి ఆలయ ఈఓగా భవానీ శంకర్ లకు బాధ్యతలు అప్పగించారు.












Click it and Unblock the Notifications