విషమంగానే శ్రీతేజ్ ఆరోగ్యం: మంత్రి కోమటిరెడ్డి పరామర్శ
Sritej health: అల్లు అర్జున్ అరెస్ట్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండట్లేదు. ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. కిమ్స్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు.

డాక్టర్ చేతన్ ఆర్ ముందాడ, డాక్టర్ విష్ణు తేజ్ పూడి పర్యవేక్షణలోని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటోన్నాడు. ఈ నెల 4వ తేదీన సంఘటన జరిగినప్పటి నుంచీ ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పులు ఉండట్లేదు. విషమంగానే ఉంటోందా బాలుడి ఆరోగ్యం. బ్రెయిన్ డ్యామేజ్‌కు గురయ్యాడు.
ఆదివారం సాయంత్రం తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీతేజ్‌ను పరామర్శించారు. శ్రీతేజ్ కోలుకోవడానికి ప్రభుత్వం ఎంతైనా ఖర్చు పెడుతుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే అమెరికా నుంచి అత్యాధునిక మందులు తెప్పించైనా బతికించాలని డాక్టర్లకు సూచించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ తండ్రి భాస్కర్ గారిని కలిసి 25 లక్షల రూపాయల చెక్కును కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరుపున అందించడం జరిగింది.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 21, 2024
శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ లను అడిగి తెలుసుకోవడం జరిగింది.
తన చికిత్సకు కోసం… pic.twitter.com/3EC5Agiowh
తన కుమారుడు ప్రతీక్ రెడ్డి పేరిట ఏర్పాటు చేసిన ఫౌండేషన్ తరఫున ఆ బాలుడి తండ్రి భాస్కర్‌కు 25 లక్షల రూపాయల ఆర్థిక సహయాన్ని ప్రకటించారు. ఈ మొత్తంతో కూడిన చెక్‌ను అందజేశారు. శ్రీతేజ్ ఎప్పుడు కోలుకుంటాడో తెలియట్లేదని అన్నారు. త్వరగా కోలుకోవాలని, మళ్లీ సాధారణ స్థితికి రావాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామని చెప్పారు.
ట్యూబ్స్ ద్వారా శ్రీతేజ్‌కు డాక్టర్లు ద్రవాహారాన్ని అందిస్తోన్నారని, ఆరోగ్య పరిస్థితిలో మార్పు ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి వైద్య ఖర్చు మొత్తాన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. శ్రీతేజ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications