వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యావరేజ్ కంటే అధికంగా: రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రత: భీకరంగా ఉత్తర తెలంగాణ: ఐఎండీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతోంది. ఎండలు ముదురుతున్నాయి. ఏ వేసవి సీజన్‌లో అయినా పగటి ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదయ్య ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈ సారి కూడా ఎండ తీవ్రత భీకరంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఈ సీజన్‌లో సగటు ఉష్ణోగ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మిడ్ సమ్మర్‌లో ఎండ తీవ్రత 46 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ స్థాయిలోనే రికార్డ్ కావొచ్చని అంచనా వేస్తోన్నారు.

పోలింగ్ నాడు అలజడికి కుట్ర: 200లకు పైగా క్రూడ్ బాంబులు: అల్లకల్లోలమేపోలింగ్ నాడు అలజడికి కుట్ర: 200లకు పైగా క్రూడ్ బాంబులు: అల్లకల్లోలమే

వాతావరణ శాఖ అధికారుల అంచనాలను నిజం చేస్తూ.. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. వేసవి సీజన్ ఆరంభంలోనే ఎండ అదరగొడుతోండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఏప్రిల్-మే నెలల్లో ఉష్ణోగ్రత గురించి తలచుకుంటేనే ఉలిక్కిపడుతున్నారు. ఈ నెలలో సాధారణం కంటే తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుందంటూ ఇదివరకే అంచనా వేశారు. ఎండ సెగకు వేడి గాలులు తోడు కావడం వల్ల తీవ్రత పెరుగుతుందని చెబుతున్నారు.

Telangana: heat waves may reach above 45 degrees in summer

తాజా అంచనాల ప్రకారం.. నడి వేసవిలో 46 డిగ్రీలకు పైగా రోజువారీ ఉష్ణోగ్రత నమోదు కావడానికి అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇదివరకు వేసవిలో హైదరాబాద్‌లో అత్యధికంగా పగటి ఉష్ణోగ్రత 44.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పదేళ్లుగా ఈ రికార్డు చెక్కు చెదరట్లేదు. ఈ సారి మాత్రం ఉష్ణోగ్రత తీవ్రత దీనికి మించి పోవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తోన్నారు. గరిష్ఠంగా 46 డిగ్రీల వరకు పెరగొచ్చని చెబుతున్నారు.

ఈ వేసవిలో సాధారణం కంటే మూడు డిగ్రీల మేర ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, వేసవి సీజన్ మధ్యలో దీని సగటు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండల్లో ఏప్రిల్-మే నెలల్లో పగటి ఉష్ణోగ్రత సగటున 43 డిగ్రీలు ఉండొచ్చని తెలుస్తోంది. మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, కామారెడ్డిల్లో 40 డిగ్రీలు ఉంటుదందని వాతావరణ శాఖ అధికారుల అంచనా. ఆదివారం నుంచి ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 38 డిగ్రీలకు పైగా రోజువారీ సగటు ఉష్ణోగ్రత నమోదవుతోంది.

English summary
According to the Meteorological Department officials, temperatures are expected to hover between 42 and 45 degrees this year, said. Heatwaves are expected to hit people badly. Hyderabad recorded a maximum temperature of 44.5 degrees for the last ten years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X