Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Group-1: గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాల్సిందే.. స్పష్టం చేసిన హైకోర్టు..

టీఎస్పీఎస్సీకి తెలంగాణ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ప్రిలిమ్స్ పరీక్ష రద్దు సరైందేనని హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పింది. డిబిజన్ బెంచ్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ను మరోసారి నిర్వహించాల్సిందేనని టీఎస్పీఎస్సీకి స్పష్టంచేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని టీఎస్పీఎస్సీ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. దీంతో టీఎస్పీఎస్సీకి మరోసారి ఎదురుదెబ్బ తగినట్లయింది.

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష సరిగా నిర్వహించలేదని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని వివరించారు. దీంతో అభ్యర్థుల పిటిషన్ పై హైకోర్టు సింగిల్ జడ్డి విచారణ జరిపారు. విద్యార్థులు లేవనెత్తిన సందేహాలతో ఏకిభవించిన జడ్జి.. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. ఇప్పటికే ఒకసారి పరీక్ష పేపర్ లీక్ అయినా.. ఇంత నిర్లక్ష్యం వ్యవహించడంపై అసహనం వ్యక్తం చేశారు.

Group-1 Prelims

అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై టీఎస్పీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పపై స్టే ఇవ్వాలని కోరింది. పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు డివిజన్ బెంచ్ కేసును విచారించింది. విద్యార్థుల తరుఫు న్యాయవాదలు బయోమెట్రిక్, హాల్ లేకుండే ఓఎంఆర్ షీట్ ఇవ్వడాన్ని కోర్టు దృషిటికి తీసుకెళ్లారు. టీఎస్పీఎస్సీ‌ తరఫున అడ్వొకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ ప్రసాద్‌‌ వాదనలు వినిపించారు. జూన్‌‌ 11న నిర్వహించిన గ్రూప్‌‌ 1 ప్రిలిమ్స్‌‌ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్‌‌ జడ్జి వెలువరించిన తీర్పును రద్దు చేయాలని హైకోర్టును కోరారు. గ్రూప్‌‌ 1 పోస్టుల భర్తీకి వెలువరించిన నోటిఫికేషన్‌‌లోనే నిబంధనల మార్పులు, చేర్పులు వంటివి చేసే అధికారాలు కమిషన్‌‌కు ఉంటాయన్నారు.

అభ్యర్థులకు జారీ చేసిన హాల్‌‌టికెట్లలో కూడా బయోమెట్రిక్‌‌ విధానం గురించి పేర్కొనలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, ప్యాన్‌‌ వంటి అధికారిక గుర్తింపు కార్డులతో హాజరుకావాలని చాలా స్పష్టంగా పేర్కొన్నట్లు చెప్పారు. పరీక్షలను రద్దు చేయాలని కేవలం ముగ్గురే అభ్యర్థులు హైకోర్టుకు వచ్చారు. 2.32 లక్షల మంది అభ్యర్థుల్లో ముగ్గురు కోరితే దాన్ని ఆమోదించడం అన్యాయమన్నారు. దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ టీఎస్పీఎస్సీపై ప్రశ్నల వర్షం కురిపించింది. గ్రూప్1 ప్రిలిమ్స్ నిర్వహణ విషయంలో టీఎస్‌‌పీఎస్సీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారా? ఇంత నిర్లక్ష్యమా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. గూప్‌‌-1 ప్రిలిమ్స్‌‌ పరీక్ష నిర్వహించే ముందు బయోమెట్రిక్‌‌ విధానాన్ని అమలు చేయడానికి వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించింది. మీరు పెట్టిన నిబంధనలను మీరే తుంగలోకి తొక్కుతారా? నిబంధనలను అమలు చేయలేనప్పుడు అనుబంధ నోటిఫికేషన్‌‌ ఇవ్వాలి కదా? పేపర్ల లీక్ వల్ల ఒకసారి గ్రూప్‌‌ 1 పరీక్ష రద్దయినా మళ్లీ సమర్థంగా పరీక్షను నిర్వహించలేకపోతే ఎలా? అంటూ నిలదీసింది.

అయితే టీఎస్పీఎస్సీ.. ఏ నోటిషికేషన్ ఇచ్చినా ఏదో వివాదం కొనసాగుతోనే ఉంది. దాదాపు ప్రతి నోటిషికేషన్, పరీక్షపై కోర్టు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకసారి పరీక్ష పేపర్ లీక్ అయినా కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై టీఎస్సీఎస్సీపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. చాలా మంది నిరుద్యోగులు తమ ఇక ఉద్యోగాలు రావంటూ.. నిరాశ పడతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+