ఆ ట్రాన్స్‌జెండర్‌కు పీజీ మెడికల్ సీటు ఎందుకు ఇవ్వరు: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్: పీజీ వైద్య విద్యలో రిజర్వేషన్ కోటా కింద ట్రాన్స్‌జెండర్ అభ్యర్థికి ప్రవేశం కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ వైద్య కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్హత ఉన్నా సీటు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ట్రాన్స్‌జెండర్ రిజర్వేషన్ కోటా కింద వైద్యవిద్యలో తనకు సీటు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ డాక్టర్ కొయ్యల రూత్‌జాన్‌పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం 2023 నీట్ పీజీలో పొందిన మార్కుల ప్రకారం పిటిషనర్ డాక్టర్ కొయ్యల్ రూత్ జాన్ పాల్ అడ్మిషన్ పొందడానికి అర్హత ఉన్నా.. సీటు ఎందుకివ్వలేదని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ), రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలోనే థర్డ్ జెండర్ వారి పట్ల దయతో కాకుండా వారి స్థానంలో ఉండి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ఎస్సీ, ఓబీసీ కోటాలలో ప్రవేశాలు పొందిన చివరి అభ్యర్థులు నీట్ పీజీ-2023లో పొందిన మార్కుల వివరాలనూ సమర్పించాలని జాతీయ వైద్య కమిషన్‌కు ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
కాగా, దేశ వ్యాప్తంగా నీట్ యూజీ ఫలితాలు గత వారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థి బోర వరుణ్ చక్రవర్తి ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మరో విద్యార్థి ప్రభంజన్ కూడా 99.99 పర్సంటైల్ తో తొలి ర్యాంక్ సాధించాడు. నీట్‌కు అర్హత సాధించిన వారిలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) వెల్లడించింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications