కరోనా కాలంలో వాయిదా వేసిన జీతం, పెన్షన్ మొత్తానికి 6 శాతం వడ్డీ ఇవ్వండి: హైకోర్టు
కరోనా వైరస్ సమయంలో వాయిదా వేసిన జీతాలు, పింఛన్ల మొత్తానికి 6 శాతం వడ్డీ చెల్లించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్: కరోనా వైరస్ సమయంలో వాయిదా వేసిన జీతాలు, పింఛన్ల మొత్తానికి 6 శాతం వడ్డీ చెల్లించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కోవిడ్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 50 శాతం వాయిదా వేస్తూ ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యంతో పాటు, పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
వీటన్నింటిపై సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఏపీలో కూడా వేతనాన్ని వాయిదా వేయడంతో 12 శాతం డిమాండ్ చేయగా.. 6 శాతం వడ్డీ చెల్లించాలంటూ ఏపీ వర్సెస్ డీ లక్ష్మి కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని తెలిపారు.

ఈ మేరకు వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇక్కడ కూడా వాయిదా వేసిన జీతం, పింఛన్ల మొత్తాన్ని 6 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. దీంతో తెలంగాణలో కూడా 6 శాతం వడ్డీతో ఆ మొత్తాలు చెల్లించనున్నారు.












Click it and Unblock the Notifications