వివేకా హత్య కేసు విచారణలో కీలక మలుపు..!!

ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన వైస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసులో నిందితుల కు శిక్ష పడేలా చూడాలని వివేకా కుమార్తె సునీత ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం సైతం సానుకూలంగా స్పందించింది. ఇదే కేసులో ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటీషన్ పైన తెలంగాణ హై కోర్టులో విచారణ వేళ సునీత తన వాదనలు వినిపించారు. కేసు విచారణ పైన హై కోర్టు సైతం కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రభావితం చేస్తున్నారు
వైఎస్‌ వివేకా హత్య కేసును నీరుగార్చేలా అనేక కుట్రలు జరుగుతున్నాయని ఆయన కుమార్తె సునీతా సందేహాలు వ్యక్తం చేసారు. పలుకుబడి కలిగిన పెద్ద వ్యక్తులు కేసును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు. నిందితులను బెయిల్‌పై విడుదల చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. వివేకా హత్య కేసులో ఏ-3గా ఉన్న గజ్జల ఉమాశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారించింది సునీతారెడ్డి తరఫున న్యాయవాది ఎస్‌. గౌతమ్‌, సీబీఐ తరఫున అనిల్‌ తన్వర్‌ వాదనలు వినిపించారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల ప్రభావానికి గురయ్యే రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అజేయ కల్లం.. తాను సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను తొలగించాలని హైకోర్టులో పిటిషన్‌ వేశారని కోర్టుకు వివరించారు.

Telangana High Court reserve the judgement over umashankar reddy Bail petition

బెయిల్ అవసరం లేదు
ఈ అంశంలో సీబీఐ పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాత.. ఆయన ఆ పిటిషన్‌లో వాదనలు వినాలని పట్టుబట్టడం లేదని పేర్కొన్నారు. ఈ కేసును మొదట విచారించిన సీఐ శంకరయ్య.. సీఆర్‌పీసీ 161 స్టేట్‌మెంట్‌ ఇచ్చి.. మేజిస్ట్రేట్ వద్ద మాత్రం సీఆర్‌పీసీ 164 స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదని చెప్పారు. కేసులో ఏ-6గా ఉన్న ఉదయ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను భయపెట్టే ఉద్దేశంతో కేసు నమోదు చేశారు. వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఏకంగా సునీతారెడ్డి, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, రాంసింగ్‌పైనే కేసు పెట్టారని కోర్టుకు వివరించారు. ఈ పరిణామాలన్నిటినీ పరిశీలిస్తే ఈ కేసును నీరుగార్చడానికి ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోందని చెప్పుకొచ్చారు.

కోర్టు వ్యాఖ్యలు
ఈ ఏడాది ఆగస్టులోనే ఉమా శంకర్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించిందని కోర్టుకు నివేదించారు. అప్పటికీ, ఇప్పటికే పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదని చెప్పారు. నిందితులు దురుద్దేశంతో ట్రయల్‌ ఆలస్యమయ్యేలా చేస్తూ అదే కారణంతో బెయిల్‌ అడుగుతున్నారని పేర్కొన్నారు. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌.. ట్రయల్‌ త్వరలో ప్రారంభమయ్యే పరిస్థితులు అస్సలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+