ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్.. టికెట్ రేట్ల ఎందుకు పెంచుతున్నారు?
తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని షాకిచ్చింది. సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలకు సంబంధించి టికెట్ల రేట్లు పెంపు అంశాన్ని హోం శాఖ కాంపౌండ్ లో పడేసిన ఉన్నత న్యాయస్థానం.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు.. కేవలం ఆ నాలుగు సినిమాలకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొన్న హైకోర్ట్.. తాజాగా హోంశాఖ కార్యదర్శి జారీ చేసిన మెమోపై పలు ప్రశ్నలు సంధించింది.
సంక్రాంతి కానుకగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన విడుదలైన 'ది రాజాసాబ్' విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవర ప్రసాద్ గారు సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అధికారులు అనుమతించిన సంగతి తెలిసిందే. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైకోర్ట్ ఆదేశాల మేరకు హోం శాఖ కార్యదర్శి మెమో జారీ చేశారు. శుక్రవారం నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్స్‌ల్లో రూ.132 టికెట్ రేట్లు పెంచుకునేందుకు, 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.62, మల్టీప్లెక్స్‌ల్లో రూ.89 టికెట ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆర్డర్స్ లో పేర్కొన్నారు. టికెట్ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కు ఇవ్వాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అయితే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత టికెట్లు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో 'రాజాసాబ్' టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రూల్స్ కు విరుద్ధంగా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారని న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. మెమో జారీ చేసే అధికారం హోంశాఖ కార్యదర్శికి లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. కలెక్టర్లు, హైదరాబాద్‌లో సీపీ మాత్రమే టికెట్ల ధరల పెంపుతో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడానికి అధికారం ఉంటుందని కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం విడుదల చేసిన మెమోపై సీరియస్ అయ్యింది. ఇక్కడే కీలక వ్యాఖ్యలు కూడా చేసింది.
తెలివిగా మెమోలు ఎందుకు ఇస్తున్నారని ప్రభుత్వ తరఫున న్యాయవాదిని ప్రశ్నించింది హైకోర్టు. టికెట్ ధరలు పెంచబోమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డే స్వయంగా ప్రకటించారని, అయినా కూడా ధరల పెంపునకు మెమోలు ఎందుకు ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీ ఆలోచన మారడం లేదంటూ మండిపడింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా? అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా..? తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని నిలదీసింది.
అసలే జరిగిందంటే..
అయితే రెండు రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు ఈ రెండు సినిమాల సంబంధించి టికెట్ల పెంపు విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేసింది. టికెట్ రేట్ల పెంపు విషయంలో నిర్మాతలు అందజేసిన వినతి పత్రాలపై నిర్ణయం తీసుకోవాలని హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు.. ఓజీ, గేమ్ ఛేంజర్, పుష్ప 2, అఖండ 2 సినిమాలకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. రాజా సాబ్,మన శంకర వరప్రసాద్ గారు టిక్కెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతుల కోసం ఇదివరకు ప్రభుత్వానికి నిర్మాతలు ప్రతిపాదనలను అందజేశారు. దీనిపై ఏ నిర్ణయం కూడా తీసుకోకపోవడం, సినిమాల విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు.
టీజీ విశ్వ ప్రసాద్, ఇషాన్ సక్సేనా, సాహు గారపాటి అప్పీల్ ను దాఖలు చేశారు. ధరల పెంపు సరికాదంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని అభ్యర్థించారు. టికెట్ల పెంపుపై గత నెలలో జస్టిస్ శ్రావణ్ కుమార్ కీలక ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. 'అఖండ 2'కు అధిక ధరలకు అనుమతించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మెమోను నిలిపివేశారు. పెంచిన ధరలకు టికెట్లు విక్రయించరాదని అధికారులను ఆదేశించారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. టికెట్ల ధరల పెంపు అభ్యర్థనలను ఇకపై స్వీకరించబోమని బహిరంగంగా ప్రకటించారు. ఈ పరిస్థితుల మధ్య రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు సినిమాల నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు.. హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించి విషయం తెలిసిందే.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
థియేటర్లలో ప్లాఫ్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications