మీరే రావాలి, బతికించుకుంటాం: కోదండ వ్యాఖ్య, కేసీఆర్ కౌంటర్!

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీది కీలక పాత్ర అని, ఆర్టీసీ నుంచి బతికించుకునేందుకు కార్యాచరణ ప్రభుత్వం వైపు నుంచి రావాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అనగా, ప్రభుత్వ రంగ సంస్థలను బతికించుకుంటే ప్రజలకే మేలు అని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నాడు వేర్వేరుగా అన్నారు.

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వ రంగ సంస్థలు బాగుపడితే ప్రజలకే మేలు అన్నారు. ఆర్టీసీ, విద్యుత్, సింగరేణిలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఈ తెలంగాణ వద్దు: కేసీఆర్‌కు కోదండ మళ్లీ షాక్, టిఆర్ఎస్ స్పందించేనా?

ఆర్టీసీ, విద్యుత్‌లలో ఇప్పుడిప్పుడే మనం కోలుకుంటున్నామని చెప్పారు. నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఉద్యోగులు, ప్రజలు సహకరించాలన్నారు. అదే సమయంలో సామాన్యుల పైన భారం పడకుండా విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని అధికారులకు సూచించారు.

కాగా, తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పల్లె వెలుగు బస్సుకు రూ.1, మిగతా బస్సుల్లో పది శాతం మించకుండా ఛార్జీలను పెంచనున్నారని తెలుస్తోంది. విద్యుత్ ఛార్జీల విషయానికి వస్తే 100 యూనిట్ల లోపు వాడే గృహ వినియోగదారులపై భారం పడే అవకాశం లేదు.

Telangana to hike bus fares!

ఆర్టీసీది కీలక పాత్ర: కోదండరామ్

అంతకుముందు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమావేశంలో కోదండరామ్ మాట్లాడారు. ఆర్టీసీని లాభాల్లో నడిపేందుకు సరైన కార్యాచరణ కావాలన్నారు. ఆర్టీసీ బకాయిల పైన ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. సంస్థ అభివృద్ధి కోసం ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలతో కలిసి రాజకీయ జేఏసీ పోరాటం చేస్తుందన్నారు.

చట్టబద్దంగా ఆర్టీసీ విభజన త్వరగా చేయాలన్నారు. రవాణా వ్యవస్థలో కార్పోరేట్ రంగాన్ని నిలువరించడం అత్యవసరమన్నారు. ప్రయివేటు ఆపరేటర్ల నియంత్రణకు ప్రభుత్వ కార్యాచఱణను కార్మికులు సూటిగా ప్రశ్నించాలన్నారు. కాగా, ఆర్టీసీ పైన కోదండరాం మాట్లాడుతూ.. ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పడం, కేసీఆర్ అదే అంశంపై మాట్లాడటం యాదృచ్ఛికమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+