వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాడంగ వస్తందో.. యానంగ పోతదో: హోంమంత్రి నాయిని, ఇవాంకా టూర్‌ షెడ్యూల్లో మార్పు!?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనపై తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ సిటీ: 'యాడంగ వస్తందో.. యానంగ పోతందో మనకు తెల్వదు. అంతా అమెరికా వాళ్ల చేతుల్లోనే ఉంది..' అని ఇవాంకా ట్రంప్‌ రాకపై హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు.

Recommended Video

Ivanka Trump Defends Her Father Always దటీజ్ ఇవాంకా! | Oneindia Telugu

ఇస్తే గుర్తుండిపోయేలా! వాళ్లలా కాదు కేసీఆర్.. ఇవాంకా కోసం భారీ గిఫ్ట్!ఇస్తే గుర్తుండిపోయేలా! వాళ్లలా కాదు కేసీఆర్.. ఇవాంకా కోసం భారీ గిఫ్ట్!

ఈ నెల 28వ తేదీ నుంచి మూడు రోజులపాటు హెచ్‌ఐసీసీలో జరిగే గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ (జీఈఎస్‌)కు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్‌ అతిథిగా హాజరవుతోన్న విషయం తెలిసిందే.

ఇవాంకా తడాఖా! బుల్లెట్ ప్రూఫ్ కారు, అయిదంచెల రక్షణ కవచం, ప్రత్యేక ఆయుధాలు!!ఇవాంకా తడాఖా! బుల్లెట్ ప్రూఫ్ కారు, అయిదంచెల రక్షణ కవచం, ప్రత్యేక ఆయుధాలు!!

 భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నిస్తే...

భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నిస్తే...

ఇవాంకా పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్న ప్రశ్నకు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అంతేకాదు.. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇవాంకా గురించి మాట్లాడుతూ ‘మనకేం తెల్వదు. అంతా అమెరికోళ్లు చూసుకుంటున్నరు. వాళ్లు ఇప్పటికే నగరానికి వచ్చిండ్రు..' అని నాయిని పేర్కొన్నారు.

అమెరికా టు బేగంపేట?

అమెరికా టు బేగంపేట?

మరోవైపు ఇవాంకా ట్రంప్‌ అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఈనెల 28న బేగంపేట విమానాశ్రయానికి వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తొలుత ఖరారైన షెడ్యూలు ప్రకారం.. ప్రధాని మోడీ బేగంపేట, ఇవాంకా శంషాబాద్‌ విమానాశ్రయాలకు చేరుకొని అక్కడి నుంచి సమ్మిట్ కు రావాల్సి ఉంది.

 ఐబీ హెచ్చరికల నేపథ్యంలో...

ఐబీ హెచ్చరికల నేపథ్యంలో...

ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనపై తాజాగా ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో షెడ్యూల్ కాస్త మారినట్లు తెలుస్తోంది. మోడీ, ఇవాంకా ట్రంప్ ఒకే విమానాశ్రయం నుంచి వస్తే భద్రత పరంగా కొంత అనుకూలంగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

మహిళా ఐపీఎస్‌ అధికారి కూడా...

మహిళా ఐపీఎస్‌ అధికారి కూడా...

ఇవాంకా ట్రంప్ భద్రతను అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ చూస్తున్నప్పటికీ తెలంగాణ నుంచి ఓ మహిళా ఐపీఎస్‌ అధికారి కూడా భద్రతా విధుల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ సమ్మిట్‌ ఏర్పాట్లకు సంబంధించి ఆయా విభాగాల అధికారులు హోటల్‌ వెస్టిన్‌లో మంగళవారమే సమావేశమయ్యారు. ప్రముఖులు రాకపోకలు సాగించే మార్గాలు, ట్రాఫిక్‌ మళ్లింపు తదితర విషయాలపై ఇంటెలిజెన్స్‌ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.

English summary
Telangana Home Minister Nayini Narsimha Reddy make comments in his own style on Ivanka Trump's Hyderabad visit. He told that the security arrangements are totally looking after by American Secret Service and we don't know how she is coming and how she is going, he said. On the other hand there is a slight change in the schedule of arrival of Ivanka it seems. Instead of Samshabad Airport She is coming to Begumpet Airport it seems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X