ఫలితాలు విడుదల చేసిన ఇంటర్ బోర్డు, రిజల్ట్ కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో ఇంటర్ ఫలితాలను కాసేపటికి క్రితం విడుదల చేశారు.నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్థన్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం, ప్రైవేటు విద్యార్థులతో కలిపి 9,42,719 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం నుండి 4,52,550 మంది విద్యార్థులు హజరుకాగా, ద్వితీయ సంవత్సరం నుండి 4,90,169 మంది విద్యార్థులు ఉన్నారు.

ఇంటర్ ప్రధమ సంవత్సరంలో 59.8 శాతం రెండో సంవత్సరంలో 65 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా ఈ సంవత్సరం కూడ బాలికలే పై చేయి సాధించారు. ప్రధమ సంవత్సరంలో బాలికలు 62.2 శాతం కాగా బాలురు 53.14 శాతం , ద్వితియ సంవత్సరంలో బాలికలు 71.05 శాతం , బాలురు, 58.2 శాతం ఉత్తీర్ణత సాధించారు.
కాగా ఫలితాలను ఈ క్రింది వెబ్‌సైట్స్ ద్వార చూసుకోవచ్చు.
www.bie.telangana.gov.in
results.cgg.gov.in
ఇంటర్ ఫలితాల హైలట్స్
ఫలితాలను విడుదల చేసిన ఇంటర్ బోర్డు కార్యదర్శి బీ.జనార్థన్ రెడ్డి
ఫస్టియర్ లో ఉత్తిర్ణత శాతం : 59.8
సెకండ్ ఇయర్ లో ఉత్తీర్ణత శాతం : 65
మేడ్చల్ ఫస్ట్ మెదక్ లాస్ట్
ఇంటర్ మీడియట్ ప్రధమ ,మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 72 శాతంతో మేడ్చల్ జిల్లా అగ్రస్థానంలో నిలించింది. కాగా 71శాతంతో రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. 29 శాతం తో మెదక్ జిల్లా చివరి స్థానం లో నిలిచింది
కాగా మే 14 నుండి అడ్వాన్స్‌డ్ సంప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు జనార్థన్ రెడ్డి తెలిపారు












Click it and Unblock the Notifications