Weather Update: మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..!
రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాలకు ముందు, వర్షం కురిసే సమయంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గాలి గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వివరించింది.
తూర్పు విదర్భ నుంచి తెలంగాణ అంతర్గత కర్నాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని.. అలాగే తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ దక్షిణ అంతర్గత కర్నాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతోనే వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. భారీగా ఇదురుగాలులు రావడంతో పలు చోట్ల చెట్ల కొమ్మలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.

జిల్లాల్లో కురిసిన వర్షాలకు వరి ధాన్యం తడిసింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపేట, పారువెళ్ల, చొక్కరావుపల్లిలో రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన వడ్లు తడిసిపోయాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల పిడుగులు పడి మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. రాష్ట్రంలో సోమ, మంగళవారం వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కనిష్ఠంగా 36 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠంగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
పక్క రాష్ట్రంలో ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి నుంచి మీరు శ్రీకాకుళం వరకు భారీగా వానలు పడ్డాయి. మంగళవార అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, అల్లూరి, మన్యం జిల్లాల్లో ఇటు ఏలూరు వర్షం కురిసింది.












Click it and Unblock the Notifications