Rain: పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం.. వచ్చే మూడు రోజులు వర్షాలే.. !
తెలంగాణలోని పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు నెలకూలడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రేకుల ఇళ్ల పై కప్పులు గాలికి లేచాయి. కరకగూడెం మండలం రేగుళ్ల గ్రామానికి చెందిన గోగు రాంబాబుకు చెందిన రెండు ఎద్దులపై పిడుగు పడింది.
ఇటు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం వాన పడింది. వర్షం కురుస్తున్న సమయంలో భారీగా గాలులు వీచాయి. దీంతో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి పడ్డాయి. దీంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. అటు హాలియాలో కూడా ఈదురుగాలులతో వాన కొట్టింది. రాష్ట్రంలో వచ్చే మూడులు రోజులు ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, జనగామ, హన్మకొండ, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురభీం ఆసిఫాబాద్, ఆదిలాద్ జిల్లాల్లో సోమవారం తేలికపాటి వాన పడే అకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, , సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో వాన కురిసే అవకాశం ఉంది.
బుధవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు జిల్లాల్ ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications